- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో టెంపుల్స్ ఆదాయం రూ.6 లక్షల కోట్లు.. అత్యంత రిచ్ దేవుడు తెలుగు నేలపైనే..!

ఆలయాలు సంపద సృష్టికి కేంద్ర బిందువుగా మారుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధాన వనరుల్లో ఆలయాలు కూడా ఒకటి. ఏటా ఆరు లక్షల కోట్ల సంపదను ఆలయాలు సృష్టిస్తున్నాయి. ఇందులో టెంపుల్ ట్రావెలిజం కావచ్చు, ఆలయాల చుట్టూ జరిగే మేళాలు కావచ్చు, భక్తులు కొనుగోలు చేసే వస్తువులు కావచ్చు. ఇలా ఏదైనా ఆలయాలు కేంద్రంగా దేశంలో అత్యంత భారీగా సంపద పంపిణీ జరుగుతున్నది. తిరుపతిలో ఇటీవల ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశంలో టెంపుల్ ఎకానమీ ఆరు లక్షల కోట్లుగా ఉన్నదని పేర్కొన్నారు. ఆలయాలు కేంద్రంగా భారీగా వ్యాపార, ఉపాధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే ఏపీ సీఎం పై వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కొన్ని ఆలయాలు ప్రపంచంలోనే అత్యంత ధనిక ధార్మిక కేంద్రాలుగా కూడా ఖ్యాతికెక్కాయి. ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఆ ఆలయం ఆస్తులు రూ.3లక్షల కోట్లపైమాటే.. ఇక ప్రతి ఏటా దాదాపుగా రూ.1400కోట్లు భక్తుల కానుకల రూపంలో అందుతున్నాయి. మరోవైపు దేశంలో పేదరికం తాండవిస్తున్నప్పుడు ఆలయాల్లో పేరుకుపోతున్న సంపదను ప్రభుత్వాలు వినియోగించాలని.. ఆలయాలను జాతీయం చేయాలన్న వాదనలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వాలు ఆలయాలనుంచి నిధులు తీసుకుంటున్నాయా? ఆలయాలు భక్తుల నుంచి వచ్చే డబ్బును ఎలా వినియోగిస్తున్నాయి? ఇంతకీ ఏ ఆలయం సంపద ఎంత? దేవుడికి కానుకలు సమర్పించే భక్తులు ఏం కోరుకుంటున్నారు? ఇలాంటి అంశాలపై దిశ ప్రత్యేక కథనం. - హరీశ్ ఎస్పీ
ఆలయాలు మొదటినుంచి సంపద సృష్టిస్తునే ఉన్నాయి. భక్తుల నుంచి తీసుకునే కానుకలే కాదు.. ఆ ఆలయాలపై ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు పొట్టపోసుకుంటున్నాయి. ప్రతి ఆలయానికి ఏటా జరిగే ఉత్సవాల్లో జాతరదే ప్రధాన ఆకర్షణ. జాతర అంటే చిన్న, పెద్ద వ్యాపారాల మేళా. అక్కడ రకరకాల వస్తువుల విక్రయం జరుగుతుంది. ఒక్కచోట అంత పెద్ద ఎత్తున వస్తు విక్రయం జరుగుతున్నదంటే ఆలయం మూలంగానే.. అందుకే ఆలయాలు సంపద సృష్టిలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. డిమాండ్ ఉంటుంది కాబట్టి దిగువ మధ్య తరగతి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారు కూడా చిన్నచిన్న పెట్టుబడులతో కుటుంబాలను పోషించుకుంటున్నారు.
కుంభమేళాలో కనకవర్షం
ప్రయాగలో నిర్వహించిన మహాకుంభమేళాలో కనకవర్షం కురిసింది. పండ్ల పుళ్లలు అమ్ముకునే వ్యక్తి రోజుకు కనీసం రూ.8వేలు సంపాదించుకున్నానన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో వ్యాపారం చేసుకోవడంతో కేవలం ప్రయాగకు 150 కిలోమీటర్ల రేడియస్ లో జరిగిన సంపద పంపిణీ అక్షరాలా రూ.3లక్షల కోట్లు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ అంచనా ప్రకారం.. 40కోట్లమందికి పైగా భక్తులు ప్రయాగకు రావడంతోపాటు అక్కడ జరిగిన వ్యాపారం 3లక్షల కోట్లు అని ప్రకటించింది. కుంభమేళాకు ముందు రూ.2లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశామని.. కానీ, మరో లక్షకోట్లు అదనంగా వ్యాపారం జరిగిందని ఆ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. కుంభమేళాకు వచ్చిన భక్తులు వసతి, భోజనంతోపాటు రవాణా ఖర్చులు.. పూజా సామగ్రి, దుస్తులు, హ్యాండీక్రాఫ్ట్ తోపాటు మేళాలో అనేక వస్తువులు కొనుగోలు చేశారని ఆ సంస్థ వెల్లడించింది. దీంతోపాటు ప్రముఖ కంపెనీలు అడ్వర్టయిజ్ మెంట్లు తదితరాలకు కూడా భారీగా ఖర్చు చేశాయని తెలిపింది. ప్రయాగ చుట్టుపక్కల రెండేళ్లలో జరిగే వ్యాపారం కేవలం 45 రోజుల్లో జరిగిందని ఆ సంస్థ సెక్రటరీ జనలర్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. కుంభమేళాకు వచ్చిన భక్తులు వారణాసి, అయోధ్యతోపాటు ఇతర ధార్మిక కేంద్రాలను సందర్శించుకోవడంతో అక్కడ కూడా వ్యాపారం బాగా జరిగిందని వెల్లడించారు. ఇదేకాదు.. ప్రతి ప్రధాన ఆలయాల వద్ద కూడా వ్యాపారం జోరుగా సాగుతుంది.. దీనివల్ల ఎన్నో కుటుంబాలకు ఆధారం దొరుకుతున్నది.
ఆపద మొక్కులవాడే రిచ్
తిరుమలలో వెలసిన ఏడుకొండలవాడు ఆపద మొక్కులవాడే కాదు.. దేశంలోనే అత్యంత ధనిక దేవుడు కూడా. ప్రతిరోజు దాదాపు 50వేలమంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం దాదాపు రూ.1400కోట్లు హుండీ ఆదాయం స్వామివారి సొంతం. ఇక ఆలయ ఆస్తులు రూ.3లక్షల కోట్ల పైమాటే. 2022లో టీటీడీ ఆలయ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయగా అందులో ఈ వివరాలన్నీ ఉన్నాయి. స్వామివారి సమర్పించే బంగారం, వెండి సహా అరుదైన ఆభరణాలతోపాటు ఏటా తలనీలాలతోనూ దండిగా ఆదాయం వస్తుంది. పైగా వివిధ బ్యాంకుల్లో చేసిన వందలకోట్ల డిపాజిట్లనుంచి భారీగానే ఆదాయం వస్తుంది. ఈ ఆలయం ఆధ్వర్యంలో వెంగమాంబ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు వేలమంది భక్తులకు ఉచిత భోజనం అందిస్తారు. ఆలయం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు, విద్యాసంస్థలు అనేకం సేవలు అందిస్తున్నాయి. అనేక ఆలయాలకు టీటీడీ అండగా ఉంటున్నది.
అనంత పద్మనాభుడు
దేశంలో రెండో రిచ్ దేవుడు కేరళలోని తిరువనంతపురంలో కొలువైన అనంత పద్మనాభస్వామి. ఆయన ఖజానాలో భారీగా పోడుపడిన బంగారు నగలు, మణులు, వజ్రాలు, అరుదైన వెండి ఆభరణాలు ఇతరత్రాలు కలిసి దాదాపుగా 1.20 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అది కూడా 2015లో కాబట్టి ఇప్పటి బంగారం విలువతో లెక్కెస్తే ఇంకా ఆ విలువ ఎన్ని రెట్లు పెరుగుతుందో మరి.
గురువాయూర్ కృష్ణుడు
కేరళలోని గురువాయూర్‌లో శతాబ్దాల కిందట కృష్ణుడి రూపంలో అవతరించిన విష్ణుమూర్తిగా భక్తులు కొలుస్తారు. గురువాయూర్ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిభక్తులు ఉన్నారు. 2022లో ఆలయ ఆస్తులపై ఆర్టీఐ పిటిషన్ దాఖలు చేయగా.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు రూ.1,737.04కోట్లు. ఆలయానికి 271.05 ఎకరాల భూమి కూడా ఉన్నది. ప్రతి ఏటా భక్తులనుంచి కానుకల రూపంలో భారీగానే ఆదాయం వస్తుంది.
జమ్ములోని వైష్ణోదేవి
సముద్రమట్టానికి 5,200అడుగుల ఎత్తులో వైష్ణోదేవి ఆలయం ఉంటుంది. దుర్గాదేవి 108 శక్తిపీఠాల్లో ఇది కూడా ఒకటి అని భక్తులు నమ్ముతారు. అమ్మవారి ఖజానాలో 1,800కిలోల బంగారం, 4,700కిలోల వెండి పోగుపడి ఉన్నది. 2000-2020 మధ్యకాలంలో భక్తులనుంచి కానుకల రూపంలో వచ్చిన ఆదాయం రూ.2వేలకోట్లు. ఆలయం ఎవరు నిర్మించారు? ఆ గుహల్లో ఆలయం ఉన్నట్టు ఎవరు గుర్తించారు? అన్న వివరాలకు కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ, వేల సంవత్సరాల పాతదని మాత్రం అందరూ నమ్ముతారు.
షిర్డీ సాయిబాబా
దేశంలో కోట్లమంది భక్తులు మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబాను కొలుస్తారు. ప్రతినిత్యం 25వేలమంది భక్తులు బాబాను దర్శించుకుంటారు. 1922లో ఆలయ నిర్మాణం జరిగింది.. ఇందులో బాబా కూర్చునే సింహాసనం 94కిలోల బంగారంతో చేసినది. ఆ ఆలయానికి ఏటా దాదాపు రూ.400కోట్లు ఆదాయం వస్తుంది. షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్ఎస్ఎస్‌టీ) ఆధ్వర్యంలో రెండు ఆస్పత్రులు నడుస్తాయి. ఈ ఆలయం ఆధ్వర్యంలో నడిచే ప్రసాదాలయో ప్రతిరోజు 50వేలమందినుంచి లక్షమంది వరకు భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తారు.
స్వర్ణ దేవాలయం
పంజాబ్ లోని అమృత్ సర్ లో స్వర్ణ దేవాలయం ఉన్నది. సిక్కులకు అత్యంత పవిత్రమైనదిగా ఈ ఆలయం ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కినది. సిక్కుల ఐదో గురు అర్జన్ నేతృత్వంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. 1581లో నిర్మాణం ప్రారంభం కాగా, 1589లో పూర్తయ్యింది. ఇక్కడే సిక్కుల తొలి గురువు గురు నానక్ ధ్యానం చేసేవారు.. అందుకే ఈ ఆలయాన్ని సిక్కులు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఆలయానికి 400కిలోల బంగారంతో తాపడం చేయడం వల్లనే దీనిని స్వర్ణ దేవాలయం అనే పేరువచ్చింది. ఈ ఆలయానికి ఏటా ఆదాయం దాదాపు రూ.500కోట్లు.
మధుర మీనాక్షి
తమిళనాడులోకి మధురై కొలువైన మీనాక్షి దేవికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. వైగి నది తీరాన ఉన్న ఈ ఆలయానికి 14 అంతస్తుల గోపురం ఉంటుంది. ఇక్కడ శివుడిని సందరేశ్వర్ గా ఆయన భార్య పార్వతిని మీనాక్షిగా భక్తులు కొలుస్తారు. ప్రతిరోజు 20వేలమంది భక్తులు ఈ గుడిని దర్శించుకుంటారు. ఇక ఏటా ఆరుకోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.
సిద్ది వినాయక
మహారాష్ట్ర రాజధాని ముంబైలో రెండు శతాబ్దాల క్రితం నిర్మించినది కావడంతో సిద్ధి వినాయక ఆలయం అత్యంత ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయమే కాదు.. పూజారి కూడా రిచ్చే. ఎందుకంటే ఆయన 4కేజీల బంగారు నగలు ధరిస్తారు. ఆలయానికి ప్రతిరోజు రూ.30లక్షల వరకు.. ఏటా 125కోట్లు ఆదాయం వస్తుంది.
సోమ్ నాథ్ ఆలయం
భారతదేశంలోని తొలి 12 జ్యోతిర్లింగాల్లో సోమ్ నాథ్ ఒకటని భక్తుల విశ్వాసం. ఆలయం లోపలిభాగాల్లో 130 కిలోలు, ఆలయ శిఖరానికి 140 కిలోల బంగారంతో తాపడం చేశారు.
పూరీ జగన్నాథుడు
ఒడిశాలోని పూరీలో కొలువైన జగన్నాథుడు కూడా దేశంలో ధనిక దేవుళ్లలో ఒకరు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో ఇంద్రద్యుమ్న అనే రాజు కట్టించాడు. ఇక్కడ జరిగే రథ యాత్ర అత్యంత ప్రసిద్ధి చెందినది. ఇక ఆలయానికి ప్రతి ఏటా రూ.150కోట్ల ఆదాయం వస్తుంది. దీంతోపాటు ఆలయం పేరిట 30వేల ఎకరాల భూమి రిజిస్టర్ అయి ఉన్నది.
దేవుడికి ట్యాక్స్ బాధలు
ఆదాయ పన్ను బాధలు మానవులకే కాదు.. దేవుడికి కూడా తప్పడం లేదు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఆలయాలకు ఆదాయపన్ను వసూలు చేసేవికావు. కానీ, జీఎస్టీ రావడంతో ఆలయాలు కూడా దాని పరిధిలోకి వచ్చేశాయి. దీంతో ఏటా అన్ని ఆలయాలు జీఎస్టీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తిరుమల ఆలయం 2024-25 సంవత్సరానికి రూ.36.28కోట్లు జీఎస్టీ కట్టింది. దేశంలోని అన్ని మతాల ధార్మిక సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం వినియోగించాల్సిన స్థలాలను ఆదాయం కోసం వినియోగిస్తే జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. షాపులనుంచి రూ.10వేలకు పైగా అద్దె వసూలు చేస్తే.. భక్తుల గదుల అద్దె రూ.1000కి మించి ఉంటే జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. దీంతోపాటు ప్రసాదాలకు వినియోగించే అన్ని వస్తువుల ధరల్లోనూ కూడా పరోక్షంగా జీఎస్టీ కలిసే ఉంటుంది.
ఆలయాల సంపద పేదలకు చేరదా?
నిజానికి ఆలయాలకు వచ్చే కానుకలు ఎలా వెచ్చించాలన్నది భక్తుల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. చాలామంది భక్తులు ఆలయ పరిరక్షణ, ధార్మిక కార్యక్రమాలకు ఆ ధనం వెచ్చించాలని కోరుకుంటారు. అంతేకాదు.. దేశంలో ఉన్న చట్టాల ప్రకారం ఆలయాలకు వచ్చే నిధులను ఆయా ధార్మిక కార్యక్రమాలకు తప్ప మరే ఇతర కార్యక్రమాలకు వెచ్చించే అవకాశం లేదు. అయితే, ఆలయాల నిర్వహణపై బ్రిటిష్ కాలంలో అనేక ఫిర్యాదులు రావడంతో 1923లో మద్రాస్ హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ బిల్లు పాసయ్యింది. దీని ఆధారంగానే 1925లో హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ బోర్డు ఏర్పాటయ్యింది. ఆ క్రమంలోనే 1940లో తమిళనాడులో ప్రముఖ ఆలయాల నిర్వహణ బాధ్యతలు చూసేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. 1959లో తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ఆలయాల నిర్వహణ, పునరుద్ధరణ, ఆడిటింగ్ వంటి పనులకు గాను ఆలయాలను ఆదాయపరంగా వర్గీకరించి వాటినుంచి 1.5శాతంనుంచి 12శాతం వరకు ప్రభుత్వాలకు చెల్లించాల్సిందిగా నిర్ణయించింది. ఈ సొమ్ము కూడా ఆ ఆలయాల నిర్వహణకు మాత్రమే వెచ్చించేలా చట్టంలో నిర్ణయించారు. మిగులు నిధులను రాష్ట్రంలోని ఇతర ఆలయాల జీర్ణోద్ధరణకు కూడా వాడవచ్చని తర్వాతి కాలంలో మార్పులు చేశారు.
కర్ణాటకలో ముజ్రాయ్
ఉమ్మడి ఆంధ్రలో..






