10 అడుగుల ఖాళీ స్థలం.. ఓ గంట సమయం.. కట్ చేస్తే ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం

by Muthe.Rajitha |

ఇంట్లో ఉన్న కేవలం 10 అడుగుల ఖాళీ స్థలం, రోజుకో గంట సమయం వెచ్చించి ఓ సాధారణ గృహిణి ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తోంది.

10 అడుగుల ఖాళీ స్థలం.. ఓ గంట సమయం.. కట్ చేస్తే ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో ఉన్న కేవలం 10 అడుగుల ఖాళీ స్థలం, రోజుకో గంట సమయం వెచ్చించి ఓ సాధారణ గృహిణి ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తోంది. వయసు, చదువు, పరిస్థితులు అభివృద్ధికి అడ్డుకావని, సంకల్పం, కష్టపడే తత్త్వం ఉంటే... ఏ రంగంలో అయినా విజయం వరిస్తుందని నిరూపించింది ఢిల్లీలో నివసించే సుమన్ సుఖిజా. అందరిలాగే సుమన్ సుఖిజా ఒక సాధారణ గృహిణి. పిల్లలు పెద్దవాళ్లై తమ తమ జీవితాల్లో బిజీగా మారిన తర్వాత, ఇంట్లో ఉండే ఖాళీ సమయంలో ఏం చేయాలో తోచలేదు.

ఆ సమయాన్ని వృథా చేయకుండా ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకుంది. అప్పుడు ఆమెకు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే కార్డిసెప్స్ (కీడా జడీ) అనే ఔషధ పుట్టగొడుగు గురించి తెలిసింది. దీని వైద్య ప్రయోజనాలను ఆర్థిక రాబడిగా మార్చుకోవాలని అనుకుంది. సైన్స్ లో మొక్కల పెంపకంలో జ్ఞానం లేకపోయినా, భయపడకుండా తానే పుస్తకాలు చదివి, ఇంటర్నెట్‌లో తెలుసుకుంటూ, ప్రయోగాలు చేస్తూ ఈ పుట్టగొడుగులను పెంచడం నేర్చుకుంది. ఇంట్లో ఉన్న కేవలం 10×10 అడుగుల చిన్న గదిలోనే సాగు ప్రారంభించింది.

మొదట చిన్న ప్రయత్నంగా మొదలైన ఈ పని క్రమంగా పెరిగి Orange Herb అనే బ్రాండ్‌గా మారింది. ప్రస్తుతం ఈ వ్యాపారంలో ఏడాదికి సుమారు ₹40 లక్షల ఆదాయం సంపాదిస్తోంది. ఇంటి పనులకే మహిళలు పరిమితం కావాల్సిన అవసరం లేదని, కొత్తగా ఆలోచించి ధైర్యంగా ముందడుగు వేస్తే గౌరవంతో పాటు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కూడా సాధించవచ్చని సుమన్ సుఖిజా విజయం మహిళలందరికీ స్ఫూర్తిదాయకం.

Next Story