Operation Sindoor : పాక్‌ను వణికించిన స్కాల్ప్, హామర్.. కామకాజీ డ్రోన్లతో సైన్యంలో నూతనోత్సాహం

by Bhoopathi Nagaiah |

దేశంలో యుద్ధగంటలు మోగాయి. పహెల్గాంకు ప్రతీకారంగా పాక్‌లోని ప్రధానమైన తొమ్మిది ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది.

Operation Sindoor : పాక్‌ను వణికించిన స్కాల్ప్, హామర్.. కామకాజీ డ్రోన్లతో సైన్యంలో నూతనోత్సాహం
X

దేశంలో యుద్ధగంటలు మోగాయి. పహెల్గాంకు ప్రతీకారంగా పాక్‌లోని ప్రధానమైన తొమ్మిది ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. సైనిక చర్యపై దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. సరిహద్దులు దాటకుండానే అధునాతన రఫెల్ ఫైటర్ జెట్లు, కామకాజీ డ్రోన్లతో నిర్వహించిన అటాక్ ను పాక్ ఏమాత్రం ఊహించలేకపోయింది. అందుకే మిస్సైళ్లు సరిహద్దులు దాటివస్తున్నా పసిగట్టలేకపోయింది. పహెల్గాం ఘటన తర్వాత పాక్ తన సరిహద్దుల్లో భారీగా మొబైల్ రాడార్లను సిద్ధం చేసింది. అయితే, భారత్ ప్రయోగించిన మిస్సైళ్లు అత్యంత వేగంతో వెళ్లేవి కావడంతోపాటు రాడార్లకు చిక్కకుండా సాంకేతిక పరిజ్ఞానం కూడా కలిగి ఉండటంతో పాక్ సైన్యం అప్రమత్తం కాలేకపోయింది. అయితే, భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో కీలకపాత్ర పోషించిన మిసైళ్లు ఏవి? రఫెల్ జెట్ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. - ఎస్పీ హరీశ్

కామకాజీ డ్రోన్లు (Kamakazee drones)

వీటిని సైనిక పరిభాషలో లోయిటరింగ్ మ్యూనిషన్స (Loitering munitions) అని అంటారు. వీటిని సూసైడ్ డ్రోన్లు (Suicide drones) అని కూడా అంటారు. అధునాతన క్షిపణి(Advanced missile)లా బీభత్సం సృష్టించడం, డ్రోన్‌లా ఎగరడం ఈ కామకాజీ డ్రోన్ల (Kamakazee drones) ప్రత్యేకత. వీటిని ‘లోయిటరింగ్’(Loitering) అని పిలవడానికి ఓ కారణం ఉన్నది. మిలిటరీలో మూములుగా ఏ క్షిపణి, డ్రోన్ అయినా, వృథా చేయరు. అందువల్ల ప్రయోగం విఫలం కాకుండా చూసుకోవడంతోపాటు తగిన వ్యవధిలో అనుకున్న లక్ష్యం చేరగలిగేనా దీనిని రూపొందించారు. ఈ డ్రోన్లు లక్ష్యంపై గాలిలో కొంత సమయం తిరుగుతూ ఉండగలవు. అక్కడ రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేసే అక్కడ సామాన్య ప్రజలు వెళ్లిపోయేవరకు లేదా టార్గెట్ అక్కడికి చేరేవరకు దానిని గాల్లోనే నిలిపిఉంచే అవకాశం ఉంటుంది. అన్ని అనుకూలిస్తే వెంటనే బాంబు టార్గెట్ ను ఫిక్స్ చేసే సెకండ్ల వ్యవధిలో భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు. వీటిని ల్యాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తారు. అయితే, రఫెల్(Raphael), ఎఫ్ సిరీస్ ఫైటర్ జెట్ల (F-Series fighter jets)నుంచి కూడా ప్రయోగించవచ్చు కానీ, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో మాత్రం వీటిని రఫెల్ విమానాలనుంచి ప్రయోగించలేదని సమాచారం.

ప్రత్యేకతలు: ఈ డ్రోన్లలో హై-రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లతోపాటు రియల్-టైమ్ డేటా ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలు ఉంటాయి. ఇవి లక్ష్యాన్ని గుర్తించడానికి, పర్యవేక్షించడానికి ఉపయోగపడతాయి. చాలా చిన్నపాటి విమానంలా ఉండే ఈ డ్రోన్ నేరుగా టార్గెట్‌ను ఢీకొట్టి పేలుతుంది. అందుకే దీనిని సూసైడ్ బాంబర్ అని పిలుస్తారు.

లోటరింగ్: ఇవి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత పేల్చేందుకు 30నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు గాలిలోనే తిరుగుతూ ఉండగలదు. సరైన లక్ష్యాన్ని ఎంచుకోవడానికి లేదా దాడి సమయాన్ని నిర్ణయించడానికి సమయం ఇస్తాయి. ఒకవేళ టార్గెట్ ఫిక్స్ కాలేకపోతే తిరిగి బేస్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల మరోసారి ఆ డ్రోన్ ను వినియోగించే అవకాశం ఉంటుంది. వనరులు వృథా కాకుండా ఉంటాయి.

పక్కగా టార్గెట్లు: ఈ డ్రోన్లు అత్యంత ఖచ్చితమైన దాడులను నిర్వహిస్తాయి. ఇవి శత్రు వాహనాలు, బంకర్లు, ఆయుధ డిపోలు లేదా నిర్దిష్ట వ్యక్తులను లక్ష్యంగా చేసుకోగలవు. ఇవి పౌర నష్టాలను తగ్గించడానికి రూపొందించబడ్డాయి. ఎందుకంటే ఆపరేటర్ దాడి ముందు లక్ష్యాన్ని ధ్రువీకరించగలడు.

రేంజ్: సాధారణంగా దీని పరిధి 10 కి.మీ. నుంచి 200 కి.మీ.

స్టెల్త్: ఇవి చాలా చిన్నవి, శబ్దం కూడా తక్కువ చేస్తాయి. వేగం కూడా చాలా ఎక్కువగా ఉండటంతో రాడార్‌లో సులభంగా గుర్తించబడవు. అందుకే వీటిని స్టెల్త్ ఆపరేషన్ల(Stealth operations)కు అనువైనవిగా సైన్యాధికారులు పేర్కొంటారు. వీటిని ఉపయోగించడం, ఖర్చు కూడా తక్కువ.

స్కాల్ప్ మిస్సైళ్లు (Scalp missiles)

ఈ క్షిపణులను స్టార్మ్ షాడో అని కూడా పిలుస్తారు. ఇవి ఫ్రాన్స్, బ్రిటన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన లాంగ్-రేంజ్, ఎయిర్-లాంచ్డ్ క్రూయిజ్ మిసైళ్లు. యూరోపియన్ డిఫెన్స్ కంపెనీ ఎంబీడీఏ తయారుచేస్తుంది. 2003 నుంచి ఫ్రెంచ్, బ్రిటీష్ సైన్యాల్లో సేవలందిస్తున్నాయి. భారత్ ఈ మిసైళ్లను రఫెల్ యుద్ధ విమానాల కోసం కొనుగోలు చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’లో వినియోగించింది. ఈ మిసైళ్ల లక్షణాలు ఇలా ఉన్నాయి.

స్టెల్త్: స్టెల్త్ అంటే మెరుపువేగంతో దూసుకుపోవడం.. సాంకేతిక పరిజ్ఞానంతో శత్రువు రాడార్ నుంచి తప్పించుకునే అవకాశం, హై వాల్యూ భవనాలను అంటే పటిష్ఠ రక్షణ ఉండే కమాండ్ సెంటర్లు ఎయిర్ ఫీల్డ్, లాజిస్టిక్ కేంద్రాలతో పాటు బంకార్లను ధ్వంసం చేయడానికి ఈ మిస్సైళ్లను రూపొందించారు. ఒకసారి టార్గెట్ ను ఫిక్స్ చేస్తే చాలు.. మిగతావన్నీ మిసైల్ చూసుకుంటుంది.

రేంజ్: 250-560 కి.మీ (సాధారణంగా 400-560 కి.మీ ఫ్రెంచ్/బ్రిటిష్ వెర్షన్‌లకు; ఎక్స్‌పోర్ట్ వెర్షన్‌లు 250-290 కి.మీ వరకు పరిమితం). ఈ రేంజ్ దాడి విమానాలను శత్రు ఎయిర్ డిఫెన్స్ జోన్‌ల నుండి సురక్షిత దూరంలో ఉంచుతుంది. దీనిలో మల్టీలేయర్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి.

ధర: ఒక్కో మిసైల్ ధర సుమారు £2 మిలియన్ (దాదాపు ₹2.1 కోట్లు), ఇది ఖరీదైన ఆయుధంగా చేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసిన దాడులకు మాత్రమే ఉపయోగించబడుతుంది.

హామర్ లేజర్ గైడెడ్ బాంబ్ (Hammer laser guided bomb)

ఈ మిస్సైళ్లను ఫ్రాన్స్‌లోని సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ అభివృద్ధి చేసింది. ఇది మధ్యశ్రేణి, ఎయిర్ టు గ్రౌండ్ ప్రయోగించవచ్చు. కచ్చితమైన గైడెడ్ మ్యూనిషన్స్ ఉండటం కూడా ఈ విమానానికి కలిసివచ్చింది. ఈ ఆయుధాలు రఫెల్, ఇతర యుద్ధ విమానాల నుండి లాంచ్ చేయబడతాయి.

లక్షణాలు: హామర్ మిసైల్.. అన్నిరకాల వాతావరణాలను తట్టుకునే స్టాండ్ ఆఫ్ ఆయుధం. ఇది సాధారణ బాంబులను కూడా కచ్చితమైన గైడెడ్ మ్యూనిషన్స్‌గా మారుస్తుంది.

హార్డ్ టార్గెట్లు: బంకర్లు, బహుళ-అంతస్తుల భవనాలు, శిక్షణా కేంద్రాలతోపాటు మొబైల్ లక్ష్యాలపై దాడులకు ఉపయోగపడుతుంది.

రేంజ్: గరిష్ట రేంజ్: 20-70 కి.మీ, లాంచ్ ఎత్తుపై ఆధారపడి (హై ఆల్టిట్యూడ్‌లో 60-70 కి.మీ, లో ఆల్టిట్యూడ్‌లో 15-20 కి.మీ).

లాంచ్ ప్లాట్‌ఫామ్‌లు: ప్రధానంగా రఫెల్, మిరాజ్ 2000D విమానాల నుంచి లాంచ్ చేయవచ్చు.

ఖచ్చితత్వం: ఐఎన్ఎస్, జీపీఎస్, ఐఆర్ తోపాటు లేజర్ గైడెన్స్ ద్వారా 1-10 మీటర్ల ఖచ్చితత్వం దీనిసొంతం.

ధర: ఒక్కో మిసైల్ ధర సుమారు €80,000-€120,000 (మన కరెన్సీలో 85 లక్షలు).

రఫెల్ ఫైటర్ జెట్ (Rafale fighter jet)

ఆపరేషన్ సిందూర్ లో భారత వైమానిక దళం రఫెల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. 4.5 జనరేషన్ కు చెందిన ఈ యుద్ధ విమానాలు వచ్చీ రావడంతోనే పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఖచ్చితమైన దాడులతో నాశనం చేశాయి. ఇటీవలే ఈ ఫైటర్ జెట్లు వాయుసేన అమ్ములపొదలో చేరాయి. ఇంకా నౌకాదళానికి అవసరమైన విమానాలు అందాల్సి ఉన్నది. మొదటినుంచి రఫెల్ వస్తే దక్షిణాసియాలో గేమ్ చేంజర్ అవుతుందని చేస్తున్న వాదనలను నిజం చేసింది. పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించకుండానే 100 నుంచి 150కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను సైతం రఫెల్ సునాయాసంగా కొట్టేసింది. మొత్తానికి రఫెల్ ఫైటర్ జెట్ల రాకతో సైన్యంలో నూతనోత్సాహం వచ్చేసింది. రఫెల్ విమానాలు బహవల్‌పూర్ (సరిహద్దు నుండి 150 కి.మీ), మురిద్కే (30 కి.మీ), సియాల్ కోట్ (10-20 కి.మీ), పీవోకేలోని కోట్లీ, ముజఫరాబాద్, బాగ్, భింబర్, గుల్పూర్, చక్ అమ్రులోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ లక్ష్యాలు జైష్ ఎ మహమ్మద్ (JeM), లష్కర్ ఎ తోయిబా (LeT), హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణా శిబిరాలతోపాటు లాజిస్టిక్ కేంద్రాలను కలిగి ఉన్నాయి. కాగా, సరిహద్దులు దాటకుండానే రఫెల్ దాడులు చేయడం.. పాక్ కన్నెత్తి కూడా తిరిగి చూసే ధైర్యం చేయకపోవడం గమనార్హం.

ప్రధాన ఆయుధాలు:

స్కాల్ప్ క్రూయిజ్ మిసైళ్లు:

రేంజ్: 250-560 కి.మీ (ఎక్స్‌పోర్ట్ వెర్షన్‌లు 250-290 కి.మీ).

వార్‌హెడ్: 450 కి.గ్రా.. గట్టి బంకర్లతోపాటు లోతైన నిర్మాణాలను నాశనం చేయవచ్చు.

హామర్:

రేంజ్: 20-70 కి.మీ.

వార్‌హెడ్: 125-1,000 కి.గ్రా.

Next Story