నడిరోడ్డుపైనే రొమాన్స్.. దిశ స్పెషల్ ఎడిషన్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-06 07:04:32  IST  )

వీధుల్లో నడుస్తున్నా, బస్సుల్లో ప్రయాణిస్తున్నా, బస్టాండ్లలో కాసేపు ఆగినా, మన కళ్లముందు కనిపించే సన్నివేశం ఒక్కటే..

నడిరోడ్డుపైనే రొమాన్స్.. దిశ స్పెషల్ ఎడిషన్
X

వీధుల్లో శృంగారానికి వెనుకాడని యూత్

బైక్, మెట్రో, బస్సుల్లోనే ఓపెన్ రొమాన్స్

డ్యాములు కట్టేస్తున్న రోబోలు.. 2వపేజీలో

మరిన్ని అప్డేట్స్ కోసం

నడిరోడ్డుపైనే శృంగారం

* నేటితరం ఎటుపోతుంది..

* వీధుల్లో రొమాన్స్ చేయటమే గ్రేట్ అనుకుంటున్నారా?

* బైక్, మెట్రో, బస్సులను బెడ్ రూంగా మార్చుకుంటున్న యూత్

* కోరిక కలిగిన చోటే తీర్చుకునేలా ఉబలాటం

* సినీ సెలెబ్రీటీలు, పొలిటిషయన్స్‌దీ ఇదే దారి

* బహిరంగ సెక్స్‌లో ఢిల్లీ మెట్రోది ప్రత్యేక స్థానం

వీధుల్లో నడుస్తున్నా, బస్సుల్లో ప్రయాణిస్తున్నా, బస్టాండ్లలో కాసేపు ఆగినా, మన కళ్లముందు కనిపించే సన్నివేశం ఒక్కటే.. ప్రేమలో మునిగిపోయిన జంటలు రొమాన్స్‌లో పరవశించడమే! పార్కులు, కాలేజీ ప్రాంగణాలు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, షాపింగ్ మాల్స్‌, మెట్రో స్టేషన్లు ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలకు వేదికలుగా మారిపోయాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నామనే సంగతే మరచి నేటితరం యువత ఇష్టం వచ్చినట్లు ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఉన్న జనం ఉన్నారనే పట్టింపు లేకుండా శృంగారంలో మునిగితేలుతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు రోజుకు ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పైగా నడిరోడ్డుపై పబ్లిక్‌గానే రొమాన్స్‌ చేయటం ఫ్యాషన్ అన్నట్లుగా భావించటం మరింత ఆందోళనకర పరిస్థితులను కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు, హగ్గులు, లిప్‌లాక్‌లు ప్రదర్శించడం ఓ అభివృద్ధి సంకేతమా? లేక సంస్కృతి పతనమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

- యేళ్ల ధవని రెడ్డి

ఇటీవల హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సిగ్నల్ వద్ద ఓ యువతి, యువకుడు బైక్‌పై కూర్చుని స్వేచ్ఛగా ముద్దుల మేళం సాగించిన వీడియో తెగ వైరల్ అయింది. దీంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇది ప్రేమ కాదు, పబ్లిక్ అశ్లీలత’ అంటూ కామెంట్లతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరులో ఇటీవల ఒక స్కూల్ విద్యార్థుల జంట ప్రైవేట్ ప్రదేశంలో శృంగార ప్రవర్తనలో పాల్గొన్న వీడియో వైరల్ కావడం, వారి తల్లిదండ్రులే కాదు, స్కూల్ సిబ్బందినీ తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. మరో ఘటనలో ఆర్టీసీ బస్ వెనక సీట్లో స్కూల్ డ్రెస్‌లో ఉన్న అమ్మాయి, అబ్బాయి.. ఒకరినొకరు గట్టిగా హత్తుకొని లిప్ లాక్ కిస్‌ ఇచ్చుకుంటున్న దృశ్యాలు నెట్టింట హల్ చల్ చేశాయి. ఇది చూసిన నెటిజన్లు స్కూల్‌కి వెళ్లే సమయంలో ఇవేం పాడుపనులంటూ దుమ్మెత్తిపోశారు. ఇక తాజాగా బెంగళూరులో సైతం ఇటువంటి ఘటనే వెలుగుచూసింది. ఓ జంట కారులో ప్రయాణిస్తూ.. సన్ రూఫ్ ఓపెన్ చేసి పైకి నిలబడి ముద్దులు, హగ్గులతో శృంగార లీలాలు సాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వటంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించి వారికి గట్టి వార్నింగ్‌తో పాటు జరిమానా కూడా విధించారు. తరచూ ఇలాంటి ఘటన వైరల్ అవ్వటం చూస్తుంటే నేటి సమాజం ఎటు పోతుందనే ఆందోళన కలుగుతున్నది. అంతేకాదు, ప్రేమను ఇలా బహిరంగంగా ప్రదర్శించడం ఆధునికతకు సంకేతంగా మారిపోయిందా? అనే సందేహం కూడా కలుగుతోంది.

ఈ ట్రెండ్ వెనుక కారణాలేంటి?

ఈ కొత్త తరం ప్రేమికుల ప్రవర్తన వెనుక ఉన్న కారణాలు ఆలోచించే.. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం, సినిమా సంస్కృతి, వెబ్‌సిరీస్‌ల గ్లామర్, యువతలో వ్యక్తిత్వం ప్రదర్శించాలనే తాపత్రయం.. ఇవన్నీ కలిసిపోవడమే ఈ పరిస్థితికి మూలం అని చెప్పవచ్చు. ఎందుకంటే.. సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో బోల్డ్ ప్రేమ సీన్లను హీరోయిజంగా చూపించటం, బస్సులో ముద్దు పెట్టుకోవడం, బైక్‌పై ప్రయాణిస్తూ హగ్గులు.. ఇవన్నీ తెరపై క్యూట్‌గా చూపించడమే కాకుండా, అవి యువత ఆచరణలోకి తీసుకురావడానికీ దోహదపడుతున్నాయి. పైగా, సోషల్ మీడియా రీల్స్ కోసం స్పెషల్ లవ్ మూమెంట్స్ సృష్టించడమే ట్రెండ్‌గా మారింది. దాంతో యువత కొంతమంది వాస్తవ జీవితాన్ని కూడా ఒక షో లా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, ప్రస్తుత బిజీ లైఫ్‌లో తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించటం కూడా ఇందుకు కారణం. పాఠశాలలు, కాలేజీల్లో టీచర్లు కూడా తమ విద్యార్థులపై సరైన శ్రద్ధ చూపించకపోవటం ఈ మార్పుకు మరో మూలంగా చెప్పవచ్చు.

సమాజంలో పెరుగుతున్న అసహనం

ఇలా యువత ప్రవర్తిస్తున్న తీరు చూసి, సమాజంలో ఉన్న పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'ఇది ప్రేమ కాదు, సంస్కృతి పతనం' అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు ఉన్న ప్రదేశాల్లో అలా ముద్దులు, హగ్గులు చేయడం చూసి చాలా మంది తల్లిదండ్రులు తామే తలదించుకుంటున్నారు. ఈ విధమైన ప్రవర్తన వల్ల చిన్న పిల్లల మానసిక ఎదుగుదలపై చెడు ప్రభావం పడుతోంది. వారి మౌలికమైన అర్థశక్తిని మించి, కొన్ని విషయాలను అసమయానికి తెలిసేలా చేస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత వ్యవహారం కాదని, ఇది సమాజంలోని ఇతరుల మీద పడే ప్రభావాన్ని కలిగి ఉందని మనం గుర్తించాలి.

కౌన్సిలింగ్ ఇస్తున్నా కట్టడి ఏది?

పోలీసులు కొన్ని చోట్ల ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు ఫైన్ వేస్తున్నారు. కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. కానీ ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. విద్యా సంస్థల్లో, కుటుంబాల్లో యువతకి నైతిక విలువలు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వేచ్ఛ తప్పకుండా ఉండాలి, ప్రేమను వ్యక్తపరచుకోవడం తప్పు కాదు. కానీ అది సమాజంలో ఉండే మరెంతో మంది మనుషుల మనోభావాలను దెబ్బతీయకూడదు.

అనారికమా.. ఆధునికమా?

ఏదైనా వ్యక్తిగత అనుభూతిని బహిరంగంగా, మర్యాద లేకుండా ప్రదర్శించడంలో దానికున్న గౌరవం కోల్పోతున్నది. మన ప్రేమను ఇతరుల కళ్లకు కాటుగా చూపించడమే ఆధునికత కాదు. ఆధునికత అంటే మర్యాదతో, సంస్కారంతో, సమాజాన్ని గౌరవిస్తూ జీవించడమే. ప్రేమకు అందరికంటే ముందుగా అవసరమయ్యేది.. పరస్పర గౌరవం, సమయం పట్ల జాగ్రత్త, ప్రదేశం పట్ల జాగ్రత్త. ప్రేమ పబ్లిక్ షో కాదని నేటితరం యువత తెలుసుకోవాలి. బస్సులో ముద్దు పెట్టుకోవడం, బైక్ మీద హగ్ చేసుకోవటం ప్రేమ కిందకు రావటం గమనించుకోవాలి.

కోర్టులు ఊరుకుంటాయా?

బహిరంగ ప్రదేశాల్లో శృంగారం చేసినా, అసభ్యకరంగా ప్రవర్తిస్తే భారత న్యాయసంహిత సెక్షన్ 296 ప్రకారం అశ్లీల చర్యగా పరిగణించవచ్చు. ఇలాంటి చర్యలకు నెల రోజుల నుంచి ఏడేళ్ల వరకు కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే గరిష్ఠంగా ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. అటువంటి చర్యకు శిక్ష కేసు యొక్క నిర్దిష్ట పరిస్థితులను బట్టి మారవచ్చు. లేదా రెండు శిక్షలను విధించవచ్చు. ఇది అశ్లీల చర్యలు, కేసు తీవ్రతను బట్టి మారాతాయి. ఇలాంటి కేసుల్లో న్యాయమూర్తి తన విచక్షణాధికారులను ఉపయోగించి శిక్షలను వేసే అవకాశం ఉంది. సెక్షన్ 296 ప్రకారం ప్రజల మర్యాద, వారి నైతికతను కాపాడే లక్ష్యాలను కాపాడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల చర్యలకు పాల్పడినా, అసభ్యకర పాటలను ప్రదర్శించినా ఈ సెక్షన్ ప్రకారం శిక్షార్హులు. భారత న్యాయసంహిత సెక్షన్ 294 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల పదార్థాల అమ్మకం, పంపిణీ, ప్రదర్శనను నిషేధిస్తుంది. జైలు శిక్ష నుండి జరిమానా వరకు శిక్షలు విధించబడతాయి. భారత న్యాయసంహిత సెక్షన్ 295 ప్రకారం మైనర్లకు అశ్లీల వస్తువులను విక్రయించడాన్ని ప్రత్యేకంగా నిషేధిస్తుంది. పునరావృత నేరాలకు పాల్పడేవారికి కఠినమైన శిక్షలు విధించే అవకాశం ఉంది.

సెలెబ్రిటీలు తక్కువేం కాదు..

పాశ్చత్య సంస్కృతికి అలవాటుపడిన ఇండియాన్స్ సైతం బహిరంగా ప్రదేశాల్లో అశ్లీల చర్యలకు పాల్పడుతున్నారు. వీళ్లలో కామంతో రెచ్చిపోయే యువతే కాదు.. హై ప్రొఫైల్ వ్యక్తులు, సినీ సెలెబ్రీటీలు సైతం ఉన్నారు. వారిలో బాలీవుడ్ నటులే ఎక్కువగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ న్యూయార్క్‌కు చెందిన మ్యాగజైన్ కోసం బోల్డ్ న్యూడ్ ఫోటోషూట్‌ చేసి సంచలనం సృష్టించాడు. పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్లు 292, 293, 509తోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67A కింద కేసు నమోదు చేశారు. అలాగే 2021లో మిలింద్ సోమన్‌ గోవా బీచ్‌లో నగ్నంగా నడుస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ముంబైకి చెందిన నటి ఉర్ఫీ జావేద్‌ ఓ టీవీ షాలో అశ్లీలమైన దుస్తువులు ధరించిదని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమె ధరించే ప్రతి డ్రెస్ అసభ్యకరంగా ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తున్నది. ఆమెపైనాముంబై పోలీసులు కేసులు నమోదు చేశారు.

రాజకీయ నాయకుల పైత్యం

బహిరంగ ప్రదేశాల్లో శృంగారం చేయడంలో రాజకీయ నాయకులు తక్కువేం కాదు. దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్లే మహిళ కార్యకర్తలను, నాయకురాళ్లను మచ్చిక చేసుకోని శృంగార క్రీడలకు పాల్పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సౌర్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు మనోహర్‌లాల్ ధకాడ్ ఒక మహిళతో నడిరోడ్డుపైనే శృంగారానికి దిగాడు. ఈ తతంగం అంతా సీసీ ఫుటేజీ రికార్డయింది. ఇందులో అతనితో ఒక స్త్రీ బట్టలు లేకుండా కనిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని మొయిపురిలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలైన సీమా గుప్తా కుమారుడు శుభం గుప్తాకు సంబంధించిన 130కి పైగా అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కేసులు సంచలనంగా మారాయి. తన ఇంట్లో పని చేసే 42 ఏళ్ల మహిళపై ప్రజ్వల్ రేవణ్ణ, అతడి తండ్రి హెచ్‌డీ రేవణ్ణ అత్యాచారం చేయడంతోపాటు నగ్న వీడియోలు తీసినట్లు కేసులు నమోదు అయ్యాయి. ఇవే కాక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళా కార్యకర్తలతో అసభ్యకరంగా ప్రదర్తించిన ఘటనలు ఉన్నాయి. ఈ చర్యలతో పదవులనూ పొగొట్టుకున్న నేతలు ఉన్నారు.

అశ్లీలతలో మెట్రోలది ప్రత్యేక స్థానం

శృంగార కార్యక్రమాలను నేటితరం బెడ్‌రూంకే పరిమితం చేయలేదు. కోరికలు కలిగిన చోటనే తీర్చుకుంటాం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. పార్కులు, సినిమా థియేటర్లను దాటి మెట్రో రైళ్లలోకి దూరిపోయారు. చుట్టూ ప్రయాణికులు ఉన్నా.. బట్టలు విప్పి బరితెగిస్తున్నారు. ఇలా ఓన్లీ అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు తెగబడుతున్నారు. తోటి ప్రయాణికుల ముందు ముద్దుల నుంచి అంగ చుంబనాల వరకు వెళ్లారు. అబ్బాయిలు ఎదురుగా ఉన్న మహిళా ప్రయాణికులను చూస్తూ హస్తప్రయోగం చేసుకున్న వీడియోలూ ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో వెలుగు చూశాయి. బెంగళూరు, ముంబై మెట్రోల్లోనూ జంటల శృంగార వీడియో బయటపడ్డాయి. ఇటీవల ఆర్టీసీ బస్సుల్లోనూ యువత ఇలాంటి నీచమైన పనులకు పాల్పడడం సోషల్ మీడియాలో చూడవచ్చు.

Next Story