- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏనుగులను తరిమేయడానికి తేనెటీగల ఫెన్సింగ్
రైతులు ఆరుగాలాలు కష్టపడి పంటలు పండించడం ఒక ఎత్తైతే, వాటిని కాపాడుకోవడం మరో ఎత్తు. అకాల వర్షాలు, అడవి జంతువుల నుంచి పంటలు కాపాడుకోవడానికి ఒక్కోసారి ప్రాణాలు కూడా పణంగా పెడతారు.

దిశ, వెబ్ డెస్క్ : రైతులు ఆరుగాలాలు కష్టపడి పంటలు పండించడం ఒక ఎత్తైతే, వాటిని కాపాడుకోవడం మరో ఎత్తు. అకాల వర్షాలు, అడవి జంతువుల నుంచి పంటలు కాపాడుకోవడానికి ఒక్కోసారి ప్రాణాలు కూడా పణంగా పెడతారు. అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకోవడం తమ చేతుల్లో లేకపోయినా, అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్కోసారి అడవి జంతువుల బారిన పది ప్రాణాలు కోల్పోతారు కూడా. అయితే ఆఫ్రికాలోని కొందరు రైతులు తాము కష్టపడి పండించిన పంటలను అడవి మృగాల బారినుండి సులభంగా కాపాడుకునే ఒక టెక్నిక్ కనిపెట్టారు.
ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియా, బోట్సువానా వంటి దేశాలలో నేషనల్ పార్కుల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల రైతులు ఈ సరికొత్త ఉపాయాన్ని అలోచించి, ఆచరణలో పెట్టి విజయం సాధించారు. ఆఫ్రికాలోని నేషనల్ పార్కులోని ఏనుగులు, అడవి దున్నలు, జీబ్రాలు వంటి జంతువులు అడవుల సరిహద్దు ప్రాంతాల్లోని పంట పొలాలపై పడి నాశనం చేయకుండా ఆ పంటల చుట్టూ తేనెటీగల ఫెన్సింగ్ ఏర్పాటు చేసారు రైతులు. ఆఫ్రికాలోని చాలా దేశాలలో వర్షాలు అధికంగానే పడినప్పటికీ, వాటిని ఎక్కడికక్కడ ఒడిసిపట్టే నీటి ప్రాజెక్టులు పెద్దగా లేవు. వర్షాలపై మాత్రమే ఆధారపడి పంటలు పండిస్తుంటారు.
అవి కూడా మొక్కజొన్న, జొన్న వంటి నీరు ఎక్కువ అవసరం లేని పంటలే ఎక్కువగా పండిస్తారు. ఆ పంటలు కాస్తా చేతికి వచ్చే కాలానికి అకాల వర్షాల కంటే నేషనల్ పార్కుకు అనుకొని ఉన్న కారణంగా అడవి జంతువులే ఎక్కువగా పంటలను నాశనం చేసేవి. ముఖ్యంగా ఏనుగులు, అడవి దున్నలు పంటల మీద పడి, అపార నష్టం కలిగించేవి. వాటిని అడ్డుకోవడానికి పెద్ద సౌండ్ చేయడం, క్రాకర్స్ కాల్చడం వంటి తాత్కాలిక చర్యలు చేపట్టినా పెద్దగా ఉపయోగం ఉండేది కాదు. పైగా ఏనుగులు, అడవిదున్నల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన రైతులు ఎందరో.
దీంతో పంటలు కాపాడుకోవడానికి ఒక కొత్త ఉపాయాన్ని ఆలోచించారు స్థానికులు. వారి పంటల చుట్టూ సాధారణ ఫెన్సింగ్ కాకుండా, తేనెటీగల ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. పంటల చుట్టూ తేనెటీగల ఫార్మింగ్ కూడా ఏర్పాటు చేయడంతో.. అది బాగా వర్కౌట్ అవడంతో ఈ విధానం మరిన్ని ప్రాంతాలకు పాకింది. పంటల కాలంలో వాటిపై పడి మేయడానికి వచ్చే వన్యప్రాణుల వల్ల తేనెటీగల గూళ్ళు చెదిరి, తేనెటీగలు వాటిపై దాడి చేసేవి. దెబ్బకు ఆ జంతువులు కాలికి బుద్ది చెప్పి, వచ్చిన దారిలో పరుగందుకునేవి. అడవి జంతుల ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండానే తమ పంటలు రక్షించుకునే ఈ విధానం 100% సక్సెస్ కావడంతో ఆఫ్రికా రైతులు ఇపుడు తేనెటీగల ఫెన్సింగ్ బాట పట్టారు. దీనివల్ల తేనే ఫార్మింగ్ జరిగి అదనపు ఆదాయం కూడా వస్తోందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏనుగుల ప్రభావం ఎక్కువగా ఉన్న దక్షిణ భారతదేశంలో కూడా ఇలాంటి ఫెన్సింగ్ లు ఏర్పాటు చేసుకోవడం వల్ల అడవిజంతులు ముఖ్యంగా ఏనుగుల బారినుంచి పంటలను కాపాడుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అడవిజంతువుల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారాలు అందిస్తూ పోవడం కంటే, అసలు అవి పంటలవైపు రాకుండా, వాటి ప్రాణాలకు కూడా ఎలాంటి ముప్పు రాకుండా ఇలాంటి చిన్నపాటి రక్షణ చర్యలపై ప్రభుత్వాలు ద్రుష్టి పెడితే మంచిదేమో.






