- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరు పీల్చే గాలిలో ఎంత ప్లాస్టిక్ ఉందో తెలిస్తే తెలిస్తే ఊపిరి ఆగిపోతుంది
మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ తోపాటు ఇతర వాయువులు కూడా కొద్దిమొత్తం ఉంటాయని మనకు తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ తోపాటు ఇతర వాయువులు కూడా కొద్దిమొత్తం ఉంటాయని మనకు తెలిసిందే. అయితే శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్న విషయం తెలిస్తే మీరు ఊపిరి తీసుకోవడానికి కూడా భయపడతారు. మనం రోజూ పీల్చుకునే గాలిలో వేలకొద్దీ మైక్రోప్లాస్టిక్ కణాలు కూడా ఉంటున్నాయని బాంబ్ పేల్చారు. ఇప్పటికిప్పుడు వీటి వల్ల జరిగే నష్టం తెలియక పోయినప్పటికీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా క్యాన్సర్, హైబీపీ, జన్యువుల మార్పు వంటి రోగాలు వస్తాయని చెబుతున్నారు.
అసలు మైక్రోప్లాస్టిక్‌లు అంటే ఏమిటి?
మైక్రోప్లాస్టిక్‌లు అనేవి 5 మిల్లీమీటర్ల కంటే చిన్నవైన ప్లాస్టిక్ కణాలు. ఇవి సాధారణంగా ప్లాస్టిక్ సంచులు, బాటిల్స్, బట్టలు, కాస్మొటిక్స్ ప్రోడక్ట్స్, టైర్లు ఇతర ప్లాస్టిక్ వస్తువులు విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడతాయి. విచ్చిన్నం అయిన తర్వాత ఈ కణాలు గాలిలో, నీటిలో, నేలలో కూడా కలిసి ఉండగలవు. కొన్ని మైక్రోప్లాస్టిక్‌లు 10 మైక్రోమీటర్ల కంటే చిన్నవిగా ఉంటాయి. అంటే అవి మన ఊపిరితిత్తులలోకి చాలా ఈజీగా చేరిపోగలవు. మన ఇళ్లలోని గాలిలో ఒక క్యూబిక్ మీటర్‌కు 500 కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటాయని చెబుతున్నారు.కార్లలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఒక క్యూబిక్ మీటర్‌కు 2,200 కణాలు ఉంటాయట. ప్లాస్టిక్ ఫర్నీచర్, బట్టలు, కార్పెట్లు, టైర్లు, ఇతర అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువుల నుండి ఈ కణాలు గాలిలోకి విడుదలవుతాయి.
మనం ఇంట్లో, కారులో గడిపే సమయం వల్ల ఈ కణాలను ఎక్కువగా పీల్చే అవకాశం ఉంది. ఒక వ్యక్తి రోజుకు సుమారు 71,000 మైక్రోప్లాస్టిక్ కణాలను లోపలికి పీలుస్తున్నారని ఈ అధ్యయనం అంచనా వేసింది. ఈ కణాలు చాలా చిన్నవి కాబట్టి, అవి ఊపిరితిత్తులలో లోతుగా చేరి అక్కడే స్థిరపడతాయి. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మైక్రోప్లాస్టిక్‌లు శరీరంలోకి చేరడం వల్ల ఊపిరితిత్తులలో ఇన్ఫ్లమేషన్, ఇమ్యూనిటీ వ్యవస్థ దెబ్బతినడం, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చని అంటున్నారు.
ఈ సమస్యను ఎలా తగ్గించాలి?
మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి మనం కొన్ని చర్యలు తీసుకోవచ్చు ఒక్కసారి వాడే ప్లాస్టిక్ సంచులు, బాటిల్స్‌కు బదులు దీర్ఘకాలికంగా వాడే వస్తువులను ఉపయోగించడం, ఇంటిలో బాగా గాలి ఆడేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం, పాలిస్టర్ వంటి సింథటిక్ దుస్తులు కాకుండా కాటన్, ఉన్ని వంటి సహజ దుస్తులను వాడటం వంటి చర్యల వల్ల మైక్రోప్లాస్టిక్ మన దేహంలోకి చేరకుండా కాపాడుకోవచ్చు.
ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్ ప్రపంచం ముందున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి. ఇప్పటికే ఉన్న ప్లాస్టిక్ తో 47% భూమిని పూర్తిగా కవర్ చేయవచ్చునని, రానున్న పదేళ్లలో అది అనూహ్యంగా పెరుగుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అదే జరిగితే తీవ్ర గ్లోబల్ వార్మింగ్ కు దారితీసి, ప్రపంచ వాతావరణ పరిస్థితులు అల్లకల్లోలం అవడం ఖాయం అని ఆందోళన చెందుతున్నారు. సో.. సాధ్యమైనంత వరకు మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, ఈ భూమిని కాపాడుకుందాం.






