Disha special: వ్యభిచారం చేయడం చట్టబద్దమా? కాదా..? సెక్స్ హబ్‌గా హైదరాబాద్‌?

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-05-22 12:50:54  IST  )

వేశ్య వృత్తి (Prostitution) నిషేధమా.. లేక చట్టబద్దమా..? ఇది చాలా మంది మదిలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

Disha special: వ్యభిచారం చేయడం చట్టబద్దమా? కాదా..? సెక్స్ హబ్‌గా హైదరాబాద్‌?
X

చీకటి వ్యాపారం..

ప్రాంతం : నేషనల్ హైవే..

సమయం : సాయంత్రం 7 గంటలు

సూర్యుడు పొద్దంతా ప్రకాశించి.. ఇక అలసిపోయినట్టు మెళ్లగా కనుమరుగు అవుతున్నాడు. ఆకాశం ఎరుపు, పసుపు, నీలిరంగుల మిళితమై అందాల తివాచీని పరుచుకుంది. అలా ఆ నీలాకాశం నల్లబడుతూ చీకటి ముసుగేసుకుంది. ఆ నల్లటి రేయిలో మబ్బుల దుప్పటి నుంచి చంద్రుడు తొంగి చూస్తూ దోబూచులాడుతున్నాడు. ఇదే సమయంలో ఓ చక్కని చుక్క రోడ్డుపై మెరుపులా మెరిసింది. గుండ్రటి మొఖం.. కలువళ్లా విచ్చుకున్న కళ్లు, చిలుకే ఈర్ష్యపడే ముక్కు, గులాబీ రేకుల్లా విచ్చుకున్న పెదాలు, ఉప్పొంగి ముందుకు నిక్కపొడిచిన ఎత్తైన ఎద, నన్నటి నడుము, నాభి కిందికి చీరకట్టు, వెనక వైపు జాలువారిన నల్లటి కురులు, జడలో మత్తెక్కించే మల్లెలు, వీటికి తోడు ఆకర్షించే పిరుదులు.. ఆహా.. బంగారం వర్ణంలో ఉన్న ఆమె అలా నడిచి వస్తుంటే గంధర్వ కన్య అనే అనుమానం రాకతప్పదు. చంద్రుడి వెలుగుల్లోనూ ఆమె అందానికి ముగ్ధుడు కాని మగాడు ఉండడేమో. దగ్గరగా వెళ్తే.. మల్లెల సుగంధాలు వెదజల్లుతూ ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించింది. రోడ్డు పక్కగా నిలబడిన ఆమె కళ్లు ఎవరి కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఆ దారిని వెళ్లే మగాళ్లపై చూపుల వల విసిరి తన వైపు లాగే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతకూ ఎవరామె..? ఎవరి కోసం ఎదురు చూస్తుంది..?

అర్థరాత్రి ఓపెన్ బిజినెస్

ప్రాంతం : మెట్రో స్టేషన్ కూడలి..

సమయం : రాత్రి 10 గంటలు..

మోడ్రన్ డ్రస్సులు, హై ప్రొఫైల్ మెయింటెనెన్స్, మత్తెక్కించే ఫర్ఫ్యూమ్ సువాసలతో కాస్ట్లీ లుక్‌లో అబ్బా.. అనిపించే అమ్మాయిలు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు, నలుగురు కలిసి ఓ బ్యాచ్‌లా నిలబడి బైక్‌లు, కార్లలో వెళ్లే యువకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తమ దగ్గరకు వచ్చిన వాళ్లతో బేరసారాలు ఆడుతున్నారు. ఎవరు వీరంతా..? రోడ్డు పక్కన నిలబడిన ఆ అప్సరసకు, ఈ కత్తిలాంటి అమ్మాయిలకు సంబంధం ఏంటి..? అబ్బాయిలను ఆకర్షించగానికి ఎందుకు అంతలా ఆరాటపడుతున్నారు..? ఒక్కొక్కరుగా యువకుల బండ్లపై ఎక్కడికి వెళ్తున్నారు? ఇలాంటి శేష ప్రశ్నలకు సమాధానమే వేశ్య. వేశ్య అంటే అందరిలో చులకన భావం, చీదరింపు, హీనురాలు. ఇలాంటి వేశ్య కథే నేటి దిశ స్పెషల్.

తను శవమై..

ఒకరికి వశమై..

తనువు పుండై..

ఒకరికి పండై..

ఎప్పుడూ ఎడారై..

ఎందరికో ఒయాసిస్సై.. అంటూ అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ (Alishetti Prabhakar) వేశ్యల జీవితాన్ని తన చిన్న కవితలో కళ్లకు కట్టారు.

-భూపతి నాగయ్య

వేశ్య వృత్తి (Prostitution) నిషేధమా.. లేక చట్టబద్దమా..? ఇది చాలా మంది మదిలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. భారత దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నిరభ్యంతరంగా వైశ్య వృత్తిని కొనసాగించవచ్చు. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం అది నిషేధం. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం.. రెండు చట్టాలు. దీనిపైనే ప్రజలు అయోమయంలో ఉండిపోయారు. దీనికి కారణం వివిధ రాష్ట్రాలు ప్రత్యేక అనుమతులు ఇవ్వడమే. గోవా, ముంబై, కోల్ కత్తా తదితర రాష్ట్రాల్లో ఈ వ్యభిచారంపై నిషేధం లేదు. పురాతన కాలం నాటి నుంచి ఈ వ్యభిచారం ప్రాచుర్యంలో ఉంది. రాజుల కాలంలోనూ ఇది కొనసాగించబడింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యభిచారాన్ని పూర్తిగా నిషేధించబడనప్పటికీ 1956 యాక్ట్ ప్రకారం చట్టవిరుద్ధం. వేశ్యాగృహాలు (Brothel House) నిర్వహించడం, మానవ అక్రమ రవాణా(Human trafficking), బలవంతంగా శృంగారం (Forced sex) చేయడం నేరం. వ్యభిచారం చేస్తే భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. అయితే, సుప్రీంకోర్టు (Supreme Court)వ్యభిచారాన్ని నేరంగా పరిగణించలేదు. సెక్షన్ 497ను కొట్టివేసింది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 మరియు 21 ఉల్లంఘనగా పేర్కొంది. ఇది సమానత్వం, జీవిత రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇస్తుందని పేర్కొంది. కానీ అపరిచిత స్త్రీ, పురుషులు ఇద్దరు ఇష్టపూర్వకంగా చేసుకునే శృంగారం(Sex) నేరం కాదని నొక్కి చెప్పింది.

సుప్రీంకోర్టు ఏం చెబుతుందంటే..?

సుప్రీంకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేసింది. బాధిత మహిళ ఇష్టపూర్వకంగా శృంగారం చేస్తున్నప్పుడు కేసులు పెట్టవద్దని సున్నితంగా వారించింది. కానీ బ్రోతల్ హౌస్ నడపడం మాత్రం నేరమేనని స్పష్టం చేసింది. ఇదే సమయంలో బలవంతంగా చేసే శృంగారం నేరమని వెల్లడించింది. అంతే కాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం సెక్స్ వర్కర్ల(Sex workers)కు సమాజంలో తగిన గౌరవం ఇవ్వడంతోపాటు జీవించే హక్కును భారత సుప్రీంకోర్టు కల్పించింది. ‘‘వ్యభిచారాన్ని అన్ని వృత్తుల లాగే ఒక వృత్తిగా గుర్తించాలి. ఇష్టపూర్వకంగా వ్యభిచారం చేసే వారిని పోలీసులు బాధించకూడదు. ఎందుకంటే, వేశ్యగృహం (బ్రోతల్) నడపడం చట్టవ్యతిరేకం కానీ, ఇష్టపూర్వకంగా వ్యభిచారం చేయడం చట్టవిరుద్ధం కాదు. వ్యభిచార స్త్రీలకు, వారి పిల్లలకూ కూడా చట్టపరమైన రక్షణ ఉండాలి. పత్రికలూ, టీవీలూ, వ్యభిచార స్త్రీల పేర్లనూ, వారి ఫొటోలనూ బయట పెట్టకూడదు. వ్యభిచార వృత్తి వారిని రకరకాల సంస్కరణలతో మార్చాలనుకోవడం, పురుషుల పెత్తందారీ నిర్ణయాలే’’ అని సుప్రీం కోర్టు సూచించింది. అయితే వ్యభిచారం వల్ల చట్టబద్దమైన విడాకుల కేసులు(Divorce cases) పెరుగుతాయని న్యాయ నిపుణులు(Legal experts) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వ్యభిచారం చేసే భార్య.. భర్త నుంచి శాశ్వత భరణం పొందే అర్హత కోల్పోయే అవకాశం ఉంది. ఆమె పిల్లలు కూడా తండ్రి నుంచి వచ్చే వారసత్వాన్ని, ఆస్తులను పొందలేరు. వివాహేతర సంబంధాలను (Illegal relationships) కొన్ని సందర్భాల్లో మానసిక క్రూరత్వం(Mental cruelty)గా పరిగణించవచ్చు. ఇది IPC సెక్షన్ 498A కింద శిక్షకు దారితీయవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఇండియాలో టాప్ రెడ్-లైట్ ఏరియాలు ఇవే..

కోల్‌కతాలోని సోనాగాచి(Sonagachi Red Light Area)లో ఆసియాలోనే అతిపెద్ద రెడ్-లైట్ జిల్లాగా పేరుగాంచింది. ఇక్కడ 10,000 నుంచి 16,000 మంది మహిళా సెక్స్ వర్కర్లతో సెగలు పుట్టిస్తుంది. భారతదేశంలో రెండవ అతిపెద్ద రెడ్-లైట్ జిల్లాగా ముంబైలోని కామాటిపుర (Kamatipura Red Light Area) నిలిచింది. ఇక్కడ 5,000 మంది సెక్స్ వర్కర్లు అత్తర్ల వాసనతో గుభాళిస్తుంటారు. మూడోస్థానాన్ని పుణెలోని బుధ్వర్ పేత్ (Budhwarpet Red Light Area) సాధించింది. 5,000 మంది సెక్స్ వర్కర్లు, 700 వ్యభిచార గృహాలతో విరాజిల్లుతోంది. 1000 మందికి పైగా సెక్స్ వర్కర్లతో న్యూఢిల్లీలోని జి.బి.రోడ్ కిటకిటలాడుతుంది. నాగ్‌పూర్ గంగా జమునలో 188 వ్యభిచార గృహాలు, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, రేషంపురా, మీరట్‌లోని కబారీ బజార్‌లో 75 వ్యభిచార గృహాలు, వేలాది మంది సెక్స్ వర్కర్లతో రెడ్ లైట్ ఏరియాలు(Red Light Area)గా ప్రసిద్ధి చెందాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని శివదాస్‌పూర్‌లో 2,000 మంది సెక్స్ వర్కర్లు, బీహార్‌లోని చతుర్భుజ్ స్థాన్, ముజఫర్‌పూర్‌ 3,500 మంది సెక్స్ వర్కర్లతో విటులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రయాగ్‌రాజ్ మీర్‌గంజ్ మహిళల అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారానికి ప్రసిద్ధి చెందింది.

ఆందోళన కలిగిస్తున్న మగ సెక్స్ వర్కర్ల సంఖ్య

గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాలకు వలస వెళ్తున్న యువకులు మేల్ సెక్స్ వర్కర్లు(Male sex workers)గా మారుతున్నారు. జీవనోపాధి కోసం నగరాలకు వెళ్లిన యువకులు డ్రగ్స్, ఇతర మత్తుపానీయాలకు అలవాటు పడటంతోపాటు ఏజెంట్ల ద్వారా మేల్ సెక్స్ వర్కర్లుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కేరళ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (Kerala AIDS Control Society)నిర్వహించిన సర్వేలో సెక్స్ వర్కర్ల వివరాలను వెల్లడించింది. కేరళలో 17వేల మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉండగా, 13,331 మంది మగ సెక్స్ వర్కర్లు ఉన్నట్లు తెలిపింది. ఇక వీరిలో 36-46 వయస్సు వారే ఎక్కువగా ఉన్నారని సర్వే వెల్లడించింది. ఇలాగే హైదరాబాద్, ముంబై, బెంగళూరులోనూ మేల్ సెక్స్ వర్కర్ల సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

సెక్స్ హబ్‌గా హైదరాబాద్

మినీ ఇండియాగా పేరొందిన హైదరాబాద్ సెక్స్ హబ్‌(Hyderabad as a sex hub)గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల సిటీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 18 దేశాలకు చెందిన యువతులు, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల యువతులు పట్టుబడటం ఈ సందేహాలకు బలం చేకూర్చుతుంది. హైదరాబాద్ కేంద్రంలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ( international sex racket) నడుస్తున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు గుప్పుమంటున్నాయి. వీటికి తగ్గట్టుగానే బంగ్లాదేశ్, బర్మా, నేపాల్, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, రష్యా, ఉగాండ మొదలైన దేశాలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అసోం, మిజోరం, గుజరాత్, గూర్ఖాలాండ్, కేరళ రాష్ట్రాల అమ్మాయిలు పోలీసులకు చిక్కారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆయా ప్రాంతాలను నుంచి అందమైన యువతులను తీసుకొచ్చి హైదరాబాద్‌లో వ్యభిచారం చేయిస్తున్నారు. మసాజ్ సెంటర్లు(Prostitution in massage center), పబ్బులు (Prostitution in pub), హోటళ్లు (Prostitution in hotel), ఓయో రూము (Prostitution in Oyo Hotels)ల్లో వీటిని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కాల్ సెంటర్ల(Prostitution in call centers)ను ఏర్పాటు చేసి మరీ ఈ దందాను నడిపిస్తున్నారు. మరికొంతమంది ఆన్‌లైన్ (Online prostitution), యాప్‌ల ద్వారా విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నడిపిస్తున్నారు.

ఒళ్లు హూనం చేసుకున్నా సొమ్ము దక్కదాయే..

ఒళ్లు హూనం చేసుకుని, కామాంధుల హింసను భరిస్తూ వ్యభిచారం చేస్తున్న యువతుల శ్రమనూ ఏజెంట్లు దోచుకుంటున్నారు. విటుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్న బ్రోకర్లు సెక్స్ వర్కర్లకు కేవలం 30 శాతం అమౌంటే ఇస్తున్నారు. 35 శాతం వాళ్లు ఉంచుకోని.. మిగతా 35 శాతం కాల్ సెంటర్ల నిర్వహకులకు, ప్రకటనదారులకు షేర్ చేస్తున్నారు. ఈ వ్యాపారంలో కష్టం మొత్తం అమ్మాయిలదే అయినా సంపాదనలో మాత్రం ఎక్కువ మొత్తం వ్యభిచార గృహ నిర్వాహకులకే పోతుంది. పోలీసులకు పట్టుబడినా కోర్టు ఖర్చులు సైతం అమ్మాయిలకు ఇచ్చే 30 శాతం నుంచే కటింగ్ చేస్తున్నారు. ఇక రోగాల పాలైన వారిని, వయసు పైబడిన మహిళలకు కనీసం బెయిల్ కూడా ఇప్పించకుండా వదిలేస్తున్నారు. ఇలాంటి వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు సహకారం అందిస్తున్నారు. సెక్స్ వర్కర్లకు జీవనోపాధి కల్పించడంతోపాటు వారి పిల్లలకు చదువు చెప్పిస్తున్నాయి. వైద్య ఖర్చులను భరిస్తున్నాయి.

మిలియన్‌కు చేరిన సెక్స్ వర్కర్ల సంఖ్య

దేశవ్యాప్తంగా సెక్స్ వర్కర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మహిళలే కాదు.. మగ సెక్స్ వర్కర్ల సంఖ్యా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సెక్స్ వర్కర్ల సంఖ్యను న్యాకో విడుదల చేసింది. 2022 గణాంకాల ప్రకారం.. ఇండియాలో 9,95,499 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారు. దీనిలో కర్ణాటక 1,53,337 మందితో తొలిస్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ 1,19,367 మందితో రెండోస్థానంలో నిలిచింది. 75,381 మందితో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నది. మహారాష్ట్రలో 95,351 మంది, ఢిల్లీలో 88,399 మూడు, నాలుగు స్థానాలు కైవసం చేసుకోగా, తమిళనాడులో 60,775 మంది, మధ్యప్రదేశ్‌‌లో 53,455 మంది, ఉత్తరప్రదేశ్‌‌లో 40,480 మంది, అసోంలో 39,721 మంది, గుజరాత్‌‌లో 37,118 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు న్యాకో వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో అత్యధికంగా లక్ష మంది జనాభాకు 450 మంది మహిళలు సెక్స్ వర్కర్లుగా మారి దేశంలోనే టాప్‌లో నిలిచారు.

హెచ్‌ఐవీలోనూ ఆంధ్రప్రదేశ్ హవా

వ్యభిచారం, హోమో సెక్స్ (Homo sex), అరక్షిత సిరంజీల వాడకం వల్ల దేశవ్యాప్తంగా హెచ్ఐవీ (HIV) కేసులు భారీగా పెరిగిపోయాయి. నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (National AIDS Control Organization)(న్యాకో), కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Union Ministry of Health and Family Welfare) సంయుక్తంగా సంకల్క్‌ బుక్‌లెట్‌-2023 నివేదికను విడుదల చేశాయి. దేశ వ్యాప్తంగా 24.67 లక్షల మంది హెచ్ఐవీ రోగులు ఉన్నట్లు ఈ నివేదికలు పేర్కొన్నాయి. రాష్ట్రాల వారిగా గణాంకాల ప్రకారం.. 3.88 లక్షల మంది హెచ్‌ఐవీ రోగులతో మహారాష్ట్ర టాప్‌లో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ 3.22 లక్షల మందితో సెకండ్ స్థానంలో ఉంది. కర్ణాటక 2.74 లక్షలు, తమిళనాడు 1.65 లక్షల్లో ఉండగా, తెలంగాణ 1.59 లక్షల మందితో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ లక్ష మందితో ఆరో స్థానంలో ఉంది. ఈ ఆరు రాష్ట్రాల్లోనే దేశంలోని హెచ్ఐవీ కేసుల్లో 72 శాతం కేసులు నమోదు అయ్యాయి.

Read More: ఎలాంటి వ్యభిచారం నేరం కాదు..

సినిమా హాల్లో కండోమ్స్ తొడిగిన కీర.. వాటి పక్కన్నే వాడిపడేసిన.

Next Story