Precast Walls : ప్రీ కాస్ట్ వాల్స్.. స్టైలిష్ లుక్‌లో రెడీమేడ్‌గా అందమైన గోడలు.. సమయం, ఖర్చు ఆదా!

by Javid Pasha |

Precast Walls : ప్రీ కాస్ట్ వాల్స్.. స్టైలిష్ లుక్‌లో రెడీమేడ్‌గా అందమైన గోడలు.. సమయం, ఖర్చు ఆదా!

Precast Walls : ప్రీ కాస్ట్ వాల్స్.. స్టైలిష్ లుక్‌లో రెడీమేడ్‌గా అందమైన గోడలు.. సమయం, ఖర్చు ఆదా!
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఖాళీ స్థలానికి లేదా ఇంటి చుట్టూ ప్రహరీ కావాలంటే ఒకప్పుడు ఇటుకలతో గోడలను నిర్మించే సాంప్రదాయ పద్ధతి ఉండేది. ప్రస్తుతం డబ్బులు, సమయం ఆదా అయ్యేలా ఇంటి చుట్టూ కాంపౌండ్ గోడల నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. ప్రీకాస్ట్ కాంపౌండ్ గోడలు వివిధ పరిమాణాలు, డిజైన్లు మొదలైన వాటిలో లభిస్తుండడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇవి మేలైనవి, నాణ్యమైనవి కావడంతో నేషనల్ హైవే అథారిటీ, ఇండియన్ రైల్వేస్, సోలార్ పవర్ ప్లాంట్ కంపెనీ, కన్ స్ట్రక్షన్ కంపెనీలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. వీటిని తయారు చేసే కంపెనీలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సుమారు వందకుపైగా అందుబాటులో ఉన్నాయి.

స్టైలిష్ లుక్..

ప్రీకాస్ట్ కాంపౌండ్ గోడలు ఉక్కు పదార్థాలు , కాంక్రీటుతో తయారు చేయబడి స్టైలిష్ లుక్ ను కలిగి ఉంటాయి . ఇవి సాంప్రదాయ గోడలకు విరుద్ధంగా ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయి . ఈ ప్రీ-కాస్ట్ కాంపౌండ్ వాల్స్ నిర్మించడానికి స్థలం విస్తీర్ణాన్ని బట్టి కనిష్టంగా గంటల సమయం నుండి గరిష్టంగా 2 రోజులు పడుతుంది .ఇదే సాంప్రదాయ గోడల నిర్మాణానికి 7 రోజులు పడుతుంది . అంతేకాకుండా ఇవి దీర్ఘకాలం మన్నికైనవి. ప్రీ కాస్ట్ గోడలు అగ్ని, తేమ నిరోధకతను కలిగి ఉంటాయి. ఇది ఈ గోడలకు చాలా కాలం జీవితాన్ని ఇస్తుంది. నిర్మాణ ప్రక్రియలో ఏదైనా లోపం జరిగితే, పూర్తిగా కొత్త గోడను సృష్టించే స్థానంలో కొన్ని షీట్లను మాత్రమే మార్చాల్సి ఉంటుంది. సాంప్రదాయ గోడల జీవితకాలం నిర్మాణంలో ఉపయోగించే వనరుల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అయితే, ప్రీ కాస్ట్ ప్యానెల్‌లు అధిక నాణ్యత కాంక్రీటుతో రీన్‌ఫోర్స్డ్ వైర్లతో తయారు చేయబడినందున ఇవి అధిక భద్రతను అందిస్తాయి. ఇవి వివిధ ఆకృతులలో లభిస్తాయి .

ప్రీకాస్ట్ కాంక్రీట్ గోడలు : ఇవి పెద్ద కాంక్రీటు ప్యానెల్స్. వీటిని బయటి గోడలు లేదా లోపలి గోడలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. అవి సాధారణంగా పెద్ద, దీర్ఘచతురస్రాకార ప్యానెల్స్ లో తయారు చేయబడతాయి, ఇవి నిర్మాణ స్థలంలో త్వరగా కనెక్ట్ చేయబడతాయి, ఇన్‌స్టాల్ చేయబడతాయి.

ప్రీకాస్ట్ కాంక్రీట్ బీమ్స్ , నిలువు వరుసలు : ఇవి భవనాలు లేదా వంతెనలకు నిర్మాణాలలో ఉపయోగిస్తారు . నిర్దిష్ట లోడ్ అవసరాలపై ఆధారపడి వివిధ ఆకారాలు, పరిమాణాలలో తయారు చేయబడతాయి.

ప్రీకాస్ట్ కాంక్రీట్ స్లాబ్‌లు మరియు పలకలు (ప్లాంక్స్) : ఈ ఫ్లాట్ ప్యానెల్స్ ని భవనాల్లో అంతస్తులుగానూ లేదా పైకప్పులుగానూ ఉపయోగించవచ్చు. అవి సాధారణంగా పొడవైన, సన్నని విభాగాలలో తయారు చేయబడతాయి. వీటిని సులభంగా రవాణా చేయవచ్చు, నిర్మాణ స్థలంలో ఇన్స్టాల్ చేయవచ్చు.

ప్రీకాస్ట్ కాంక్రీట్ మెట్లు : వీటిని భవనాలలో మెట్లుగా నిర్మించడానికి ఉపయోగించవచ్చు. అవి ముందే ఇన్‌స్టాల్ చేయబడిన ట్రెడ్‌లు, రైజర్‌లతో వస్తాయి. అలాగే వాటిని నిర్దిష్ట బిల్డింగ్ డిజైన్ అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించుకోవచ్చు .

ప్రీకాస్ట్ కాంక్రీటు నిలబెట్టుకునే గోడలు : ఇవి నేల లేదా ఇతర పదార్థాలను నిలుపుకోవడానికి ఉపయోగించే మూలకాలు. ఇవి సాధారణంగా ఇంటర్‌లాకింగ్ అంచులతో తయారు చేయబడతాయి. గోడను ఎక్కడా ఖాళీ లేకుండా నిరంతరాయంగా ఉండేలా నిర్మించడానికి అనుసంధానించబడతాయి. వీటిని నిర్దిష్ట బరువులు మోయాల్సిన అవసరాల్ని తీర్చడానికి డిజైన్ చేయడతాయి.

హ్యాండ్ మేడ్ ప్రీ కాస్ట్ ధరలు : తయారీ అనంతరం లోకల్ అయితే ఎస్ ఎఫ్ టీ రూ 50 నుండి రూ 55 ,150 కిమీ వరకు వెళ్తే రూ 60, అంతకు మించి వెళితే దూరాన్ని బట్టి రవాణా చార్జీలు కూడా చెల్లించాలి. రవాణా చార్జీలు కలిపి ఎస్ ఎఫ్ టీ రూ 70 వరకు ఉంటుంది. గరిష్టంగా మూడు వందల కిలోమీటర్ల దూరంలో వీటిని ఏర్పాటు చేస్తారు. 1.5 ఇంచెస్ మందం ప్రీ కాస్ట్ షీట్స్ కు 7 ఇనుప రాడ్స్ వాడుతారు. వీటిని మార్నింగ్ తయారు చేసి సాయంత్రానికి లిఫ్ట్ చేసి నెట్ కొడతారు. వారం రోజులు క్యూరింగ్ చేసిన అనంతరం విక్రయిస్తారు . ఇవి మట్టితో తయారు చేసే బ్రిక్ కంటే 50 శాతం తక్కువ. ప్రీ కాస్ట్ షీట్స్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలంటే ధర సుమారు రూ 20 వరకు పెరుగుతుంది . అయితే ముందుగా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.

మిషన్ మేడ్ ప్రీ కాస్ట్ : వీటి ధర ఎస్ ఎఫ్ టీ రూ 110 వరకు ఉంటుంది. షీట్ మందంస్ 2 ఇంచులు. ఇందులో 4 ఇనుప రాడ్స్ ఉపయోగిస్తారు .ఇవి తయారీ అనంతరం 24 గంటల పాటు మిషన్ లో ఉంటాయి .వారం రోజుల పాటు నీటితో క్యూరింగ్ చేస్తారు . వెంచర్లు , ప్లాట్స్, రూమ్స్ , కాంపౌండ్ వాల్ కు వీటిని వాడుతారు .మిషన్ మేడ్ ప్రీ కాస్ట్ బ్రిక్ రేటుతో సమానంగా ఖర్చవుతుంది.అయితే క్వాలిటీ బాగుంటుంది.

గదులు కూడా నిర్మిస్తాం : చెరిపల్లి గిరి - కనకదుర్గ ప్రీ కాస్ట్- బొంగుళూరు

ప్రీ కాస్ట్ తో గదులు నిర్మిస్తే రూ 500 వరకు ఎస్ ఎఫ్ టీ తీసుకుని మొత్తం తయారు చేసి ఇస్తాం. సుమారు 20 X20 సైజు గదికి రూ 2.30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. క్వాలిటీ పెరగాలంటే రేటు పెరుగుతుంది. గది తయారు కావడానికి సుమారు 25 రోజుల సమయం పడుతుంది. విద్యుత్ సప్లై తో సహా గదిని తయారు చేసి ఇస్తాం. 2017లో ఈ వ్యాపారం మొదలు పెట్టాం . సుమారు 300 కిమీ పరిధి నుండి ప్రీ కాస్ట్ కొనుగోలు కోసం వస్తుంటారు . వ్యాపారం సంతృప్తికరంగా ఉంది.

Next Story