- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా, ఎబోలా కంటే డేంజర్ వ్యాధి.. చూస్తే వెన్నులో వణుకే
పదేళ్ల కిందట ఎబోలా, ఐదేళ్ల కింద కరోనా ప్రపంచాన్ని వణికించాయి.

దిశ, వెబ్ డెస్క్ : పదేళ్ల కిందట ఎబోలా, ఐదేళ్ల కింద కరోనా ప్రపంచాన్ని వణికించాయి. ఇక లోకంలో ఉన్న మానవజాతి సమూలంగా తుడిచిపెట్టుకొని పోతుందేమో అనేంతగా ఆ రెండు మహమ్మారులు గజగజలాడించాయి. కొంతకాలం ప్రజలంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికారు. ఎలాగోలా ఆ గండాలు దాటుకొని ఇప్పుడిప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటుండగా.. మరో కొత్త ముప్పు ప్రపంచం ముంగిటకు వస్తోంది. ఇది ఎబోలా, కరోనా లాగ దేహం లోపల మాత్రమే కాదు, బయటికి కూడా చాలా భయంకర లక్షణాలను కనబరుస్తుంది. వాటిని చూశారంటే బిక్కచచ్చి పోవాల్సిందే. అదే "క్యూటేనియస్ ఫైబ్రోమాస్" వ్యాధి.
పాపిలోమా వైరస్ వలన ఈ వ్యాధి సంభవిస్తుంది. ఇటీవల ఈ వ్యాధికి గురైన "మ్యూటెంట్ డీర్ విత్ ఫ్లెష్ బబుల్స్" జింకలకు సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. క్యూటేనియస్ ఫైబ్రోమాస్ వ్యాధి వలన చర్మంపై పెద్ద మాంసపు గడ్డల వంటివి ఏర్పడి, చూడటానికి భయంకంరంగా కనిపిస్తాయి. సడన్ గా వాటిని చూస్తే జాంబీ డీర్స్ అనుకుంటాం. ఈ మాంసపు గడ్డలా నుంచి రక్తం, రసి కారుతూ, చివరికి ప్రాణాలు కోల్పోతాయి. ఇవి మరొక జింకను తగిలినప్పుడు చర్మంపైగల రక్తం, రసి ద్వారా వైరస్ లు మరో జింకలోకి చేరి వాటికి కూడా వ్యాధిని కలిగిస్తాయి. తేమ, తడి వాతావరణంలో మరింత త్వరగా ఈ వైరస్ లు వ్యాప్తి చెందుతాయి.
అయితే ఇప్పటివరకు ఈ వ్యాధి జింకలకు మాత్రమే పరిమితం అయిందని, ఇతర జంతువులకు గాని మనుషులకు గాని సోకిన కేసులు నమోదు కాలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఈ వ్యాధి ప్రభావం మనుషులపై లేకపోయినా వైరస్ లు కాబట్టి భవిష్యత్తులో మానవులకు సోకే అవకాశాలు కొట్టిపారేయలేం అంటున్నారు. ఇప్పటివరకు చికిత్స అంటూ లేని ఈ క్యూటేనియస్ ఫైబ్రోమాస్ వ్యాధి మనుషులకు సోకుతుందనే ఊహ కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఆ జింకలను చూస్తుంటే.






