ఆకాశంలో నదులు ఉంటాయా?

by Muthe.Rajitha |

నదులు భూమి మీదనో కొన్నిసార్లు భూమి పొరల కింద, ఎడారి అడుగున ఉండటం మనకు తెలుసు.

ఆకాశంలో నదులు ఉంటాయా?
X

దిశ, వెబ్ డెస్క్ : నదులు భూమి మీదనో కొన్నిసార్లు భూమి పొరల కింద, ఎడారి అడుగున ఉండటం మనకు తెలుసు. కానీ నదులు ఆకాశంలో ఉంటాయా అంటే? అవును ఉంటాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆకాశ నదులు అంటే వాతావరణంలో ఉన్న భారీ నీటి ఆవిరి పొడవైన, వెడల్పైన పట్టీలుగా ప్రవహించే గాలి ప్రవాహాలు. ఇవి సాధారణంగా మన కంటికి కనిపించవు. కానీ ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీల ద్వారా గుర్తించవచ్చు. గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడెక్కుతుండటంతో సముద్రాల నుంచి ఎక్కువ నీరు ఆవిరిగా మారడం వల్ల, ఈ ఆకాశ నదులు ఏర్పడతాయి. ఈ నదులు చాలా ప్రమాదకరం అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఎందుకంటే ఈ ఆకాశ నదులు కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువ సమయంలో భారీ వర్షాలను కురిపిస్తాయి. దీనివల్ల వరదలు, కొండచరియలు విరిగిపడటం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ నదులు అకస్మాత్తుగా విరిగిపోయి, "రెయిన్ బాంబ్స్" లేదా "క్లౌడ్ బరస్ట్" అనే భారీ వర్షాలను కురిపిస్తాయి. ఇవి పంటలను నాశనం చేస్తాయి. అడవులను, జంతువుల ఆవాసాలను ధ్వంసం చేస్తాయి. అయితే ప్రపంచంలోని అనేక దేశాలతోపాటు భారతదేశంలో కూడా ఈ ఆకాశ నదుల ప్రభావం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇటీవలి ఆకస్మిక వరదలు, కొండచరియలు జారి పడటానికి ఇవే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గ్రీన్‌హౌస్ వాయువులు, జీవ ఇంధనాల దహనం, అడవుల నిర్మూలనం, ఫ్యాక్టరీల నుంచి వెలువడే విష వాయువులు, ఎయిర్ కండిషనర్లలో ఉపయోగించే సీఎఫ్‌సీలు గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణంగా కాగా.. ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల భూమి ఉష్ణోగ్రతను బాగా పెరిగి, గ్లేసియర్స్ కరగడం ఫలితంగా సముద్ర మట్టాలు పెరగడం, వాతావరణ విపత్తులు సంభవించడం, జీవవైవిధ్యతకు నష్టం వాటిల్లడం, ఆహార ఉత్పత్తి తగ్గడం, ఆరోగ్య సమస్యలు వంటి తీవ్ర ప్రభావాలను కలిగిస్తాయి.

మరి ఈ గ్లోబల్ వార్మింగ్ ను నివారించడానికి ప్రకృతిలో శక్తిని మితంగా వాడాలని, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించాలని చెబుతున్నారు. అంతేకాదు అడవులను కాపాడటం, వాతావరణంలోకి ఎక్కువ కాలుష్యం వెదజల్లకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించాలని, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.

Next Story