- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బట్టీల బతుకుల్లో.. అక్షర దివిటీలు.!
ఆ జీవన చిత్రాన్ని మార్చాలనుకున్నాడు ఝార్ఖండ్‌కు చెందిన అన్షు జైస్వాల్

దిశ, ఫీచర్స్: బీహార్ ఇటుక బట్టీల్లో చిన్న చేతులు ఇటుకలను తయారుచేస్తుంటే ఆ దుమ్ము మధ్య బాల్యం కనుమరుగవుతోంది. చదవాలని ఆశలున్నా అవి అడియాశలే ఐపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ జీవన చిత్రాన్ని మార్చాలనుకున్నాడు ఝార్ఖండ్‌కు చెందిన అన్షు జైస్వాల్.
ఇటుకలు కాదు పుస్తకాలు..
అన్షు జైస్వాల్ బట్టీల్లో నలిగిపోతున్న బాల్యా్న్ని కాపాడటం కోసం 2023లో ''నీవ్ కీ ఈంట్'' ఫౌండేషన్ ప్రారంభించాడు. ఇటుక బట్టీల్లోనే ''అక్షర్ లెర్నింగ్ సెంటర్లు'' ఏర్పాటు చేశాడు. ఇక్కడ పిల్లలు ఇటుకలు కాకుండా పుస్తకాలు పట్టుకుని మ్యాథ్స్, సైన్స్, హిందీలో పునాది నేర్చుకునేలా చేశాడు. అన్షు జైస్వాల్ చొరవతో 3000కి పైగా పిల్లలు పాఠశాలల్లో తిరిగి చేరారు. బీహార్లోని బాలలొప్పందం, ముసహర్ వంటి కమ్యూనిటీల్లో మార్పు తీసుకొచ్చి వారికి విద్యా హక్కు గురించి నిత్యం అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకొస్తున్నాడు.
వెట్టిలో మట్టి బిడ్డలు..
ముసహర్ కులానికి చెందిన కుటుంబాల జీవితమంతా ఇటుక బట్టీలకే త్యాగం అవుతోంది. పెద్దవాళ్లు సరే.. పాపం చిన్న పిల్లలు బతుకు ఆగమవుతోంది. తినడానికి తిండి కరువు. కనీసం సొసైటీలో మనుషులుగా చూసే అవకాశం కూడా లేని పరిస్థితి. బయట దొరికే ఆకుకూరలు.. చిన్న చిన్న పరక చేపలే వీళ్ల ఆహారం. అన్షు బట్టీలకు వెళ్లినప్పుడు వీళ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ఎండలేదు.. చలిలేదు.. 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలు ఈ వెట్టిలో కూరుకుపోయి బంగారు భవిష్యత్‌ను దూరం చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడితే.. "వాళ్లు స్కూలుకువోతే ఇటుకలెవడు చేస్తరు" అన్నాడు.
మెయిన్‌స్ట్రీమ్ స్కూల్స్‌కు సిద్ధం..
ఆధార్ కార్డులు లేవు.. రేషన్ కార్డులు లేవు. ప్రభుత్వ పథకాల ముచ్చటే లేదు. ఇదంతా చూసిన అన్షు ఈ జనరేషనల్ ట్రాప్‌ను బ్రేక్ చేయాలను గట్టిగా అనుకున్నాడు. దుమ్ముతో దెబ్బతిన్న పిల్లలు ఇప్పుడు పుస్తకాలు చేత్త పట్టుకొని కనిపిస్తున్నారు. "స్వాభిమాన్ ఫెలోలు"గా లోకల్ వలంటీర్లను నియమించాడు అన్షు. కాంట్రాక్టర్లను కౌన్సిలింగ్ ఇచ్చి ఇటుకబట్టీల్లోనే క్లాసులు చెప్పిండం స్టార్ట్ చేశాడు. బట్టీల్లోనే "అక్షర్ సెంటర్లు" వెలసి వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తు్న్నాడు. ఇటుకబట్టీల్లో పనిచేసే పిల్లలను మెయిన్‌స్ట్రీమ్ స్కూల్స్‌కు సిద్ధం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
మూడంచెల విజన్..
అన్షు విజన్ మూడు స్తంభాలపై నడుస్తోంది. అవి.. అవగాహన, విద్య, సాధికారత. మొదట కాంట్రాక్టర్లు, తల్లిదండ్రులకు బాల కార్మిక నేరం గురించి.. విద్యా హక్కు గురించి అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత "అక్షర్ సెంటర్"లో ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీని బోధిస్తారు. గణితం.. హిందీ వాళ్ల టార్గెట్. ఆ తర్వాత సాధికారత. ఆధార్, రేషన్ కార్డులు, పెన్షన్లు ఏర్పాటు చేస్తారు. గతేడాది 400 పిల్లలు సెంటర్లలో చేరారు. 50 కుటుంబాలు ప్రభుత్వ పథకాలు పొందాయి. ఇలా మొత్తం 3000 మంది పిల్లల జీవితాలు మార్చాడు. వాళ్లు పెద్దయ్యాక కెరీర్ గైడెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్లో శిక్షణిచ్చి ఉద్యోగాలు పొందేలా ప్రేరేపిస్తున్నాడు.






