ఎడారి గాలి నుంచి తాగునీరు పుట్టించే అద్భుత పరికరం

by Muthe.Rajitha |

భూమి మీద 90 శాతం నీరే ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాలు నీరు లేక ఎడారులుగా మారిపోతూ ఉంటాయి.

ఎడారి గాలి నుంచి తాగునీరు పుట్టించే అద్భుత పరికరం
X

దిశ, వెబ్ డెస్క్ : భూమి మీద 90 శాతం నీరే ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాలు నీరు లేక ఎడారులుగా మారిపోతూ ఉంటాయి. కారణాలు ఏమైనప్పటికీ నీరు లేకపోవడం ఆయా ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. రోజూ అవసరాలకు, తగవు నీరు లేకపోతే మనిషి మనుగడ సాగించలేడు. తాగడానికి నీరు లేని చోట మనిషి మాత్రమే కాదు ఏ ప్రాణి కూడా బతికి బట్టకట్టలేదు. మరి భూమి మీద మొత్తం 33 శాతం ఎడారులు ఆక్రమించాయి అంటే అంత పెద్దమొత్తం నేలపై నీరు లేదనే కదా. ఎలాగైనా ఎడారులను కూడా చిట్టడవులు, గడ్డిభూములతో నింపాలని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా బ్రెజిల్ ఇంజనీర్లు విద్యుత్ లేకుండానే ఎడారి గాలిలోని తేమను త్రాగునీటిగా మార్చే అద్భుత పరికరాన్ని రూపొందించారు. ఇది చెరుకు పిప్పి నుంచి వచ్చే వ్యర్థ పదార్థమైన బాగాస్‌తో తయారైన బయోచార్ ను ఉపయోగించి తయారు చేసారు. రాత్రిపూట తేమను గ్రహించి, పగటి సమయంలో సూర్యరశ్మితో నీటిగా మార్చి, ఒక చదరపు మీటరు విస్తీర్ణంలో రోజుకు 1.5 లీటర్ల నీరు ఉత్పత్తి చేస్తుంది ఈ పరికరం. విద్యుత్తు, డీజిల్ లాంటి కాలుష్యం లేని ఈ పరికరం, MIT, UC బర్క్లీ వంటి సంస్థల హైటెక్ పద్ధతుల కంటే తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితంగా రూపొందించారు.

అంతేకాదు సాధారణ పౌరులకు అందుబాటులో ఉండేలా దీన్ని తయారు చేసినట్టు చెబుతున్నారు. తీవ్ర నీటి కొరతతో అల్లాడే ఎడారి ప్రాంతాలకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడనుంది. ఎడారుల్లో పచ్చదనపు ఆశాకిరణాలు వెల్లివిరియాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story