అనాథల కోసం ఉస్మానియాలో స్పెషల్ వార్డు

146
Special ward in Osmania hospital

దిశ, తెలంగాణ బ్యూరో: అపరిచిత రోగులకు చికిత్స అందించేందుకు ఉస్మానియా ఆసుపత్రిలో స్పెషల్ వార్డును ఏర్పాటు చేసినట్టు ఆసుపత్రి అధికారులు గురువారం ప్రకటించారు. ఔట్‌ పేషెంట్‌ బ్లాక్‌లోని 2వ అంతస్తులో ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సౌకర్యాలను కల్పించామన్నారు. నిరాశ్రయులు పోలీసుల ద్వారా ఆసుపత్రికి వస్తే ఈ వార్డులో చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు. ఈ విధానం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశ పెడుతున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. అయితే స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ సహకారంతో వార్డును ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ వార్డులో ఉస్మానియా వైద్యులు, నర్సులు రోగులకు చికిత్సను అందిస్తారన్నారు.