- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
<p>దిశ, అమరావతి బ్యూరో: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం జూలై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేకప్రవేశ దర్శన టికెట్ల కోటాను సోమవారం టీటీడీ అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. రోజుకు 9 వేల టికెట్ల చొప్పున స్లాట్ల వారీగా అందుబాటులో ఉంచనున్నారు. జూలై 1వ తేదీ నుంచి రోజుకు 3 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్ల ద్వారా భక్తులు ఒక రోజు ముందు […]</p>

దిశ, అమరావతి బ్యూరో: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం జూలై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేకప్రవేశ దర్శన టికెట్ల కోటాను సోమవారం టీటీడీ అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. రోజుకు 9 వేల టికెట్ల చొప్పున స్లాట్ల వారీగా అందుబాటులో ఉంచనున్నారు. జూలై 1వ తేదీ నుంచి రోజుకు 3 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్ల ద్వారా భక్తులు ఒక రోజు ముందు ఈ టోకెన్లు పొందవచ్చు. జూలై 1న శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను జూన్ 30న తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తారు. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 16న ఆణివర ఆస్థానం, జూలై 24న శ్రీ ఆండాళ్ తిరువాడిప్పూరం శాత్తుమొర, తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు,జూలై 28న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి, జూలై 30 నుండి ఆగస్టు ఒకటి వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి.






