కార్తీక మాసం సందర్భంగా ఘనంగా ప్రత్యేక పూజలు..

by Shyam |

<p>దిశ, భువనగిరి: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భువనగిరి‌లోని పచ్చల కట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి కప్పగంతుల నాగరాజ్ శర్మ, ఆలయ చైర్మన్ కాలేరు లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో స్వామి వారికి మహన్యాస రుద్రాభిషేకం అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారికి అన్న పూజ అలంకరణ‌లో అమర్నాథ్ లింగ అలంకరణ చేయడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, మున్సిపల్ [&hellip;]</p>

karthika masam
X

దిశ, భువనగిరి: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భువనగిరి‌లోని పచ్చల కట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి కప్పగంతుల నాగరాజ్ శర్మ, ఆలయ చైర్మన్ కాలేరు లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో స్వామి వారికి మహన్యాస రుద్రాభిషేకం అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారికి అన్న పూజ అలంకరణ‌లో అమర్నాథ్ లింగ అలంకరణ చేయడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ మాయ దశరథ, గంగరాజు ప్రసన్న, భాష‌బోయిన రాజేష్, దేవరకొండ నరసింహాచారి, కొల్లూరి రాజు, ముత్యాల మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story