- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిస్తున్న డ్రోన్లు.. రంగంలోకి స్పెషల్ టీమ్స్
<p>దిశ, వెబ్‌డెస్క్ : శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో డ్రోన్ సంచారం పెరగడంతో స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు. రాత్రి వేళల్లో పలుమార్లు డ్రోన్ కనిపించడంతో స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రోన్ ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ఇంటింటికీ తిరుగుతూ తనిఖీలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఐదుగురు ఎస్సైలతో కూడా పోలీసు బృందం డ్రోన్ వేటలో నిమగ్నమైంది. సుమారు 100 మంది పోలీసులు […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో డ్రోన్ సంచారం పెరగడంతో స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు. రాత్రి వేళల్లో పలుమార్లు డ్రోన్ కనిపించడంతో స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రోన్ ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ఇంటింటికీ తిరుగుతూ తనిఖీలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఐదుగురు ఎస్సైలతో కూడా పోలీసు బృందం డ్రోన్ వేటలో నిమగ్నమైంది.
సుమారు 100 మంది పోలీసులు ప్రత్యేకంగా డ్రోన్ కలకలంపై ఆరా తీస్తున్నారు. ఆలయం డ్రోన్‌తో వెంబడించినా ఆ డ్రోన్ ఆచూకీ తెలియలేదు. శ్రీశైలంలో కలకలం రేపుతున్న డ్రోన్ కోసం అధికారులు పోలీసు డ్రోన్‌ను సైతం తెప్పించినట్లు సమాచారం. కాగా, డ్రోన్ కలకలంపై జిల్లా ఎస్పీ పక్కిరప్ప స్వయంగా రంగంలోకి దిగారు. పోలీసులు పహారా కాస్తుండగానే రెండు డ్రోన్లు గాలిలో చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆగంతక డ్రోన్ల కోసం పోలీసులు రాత్రింబవళ్లు ముమ్మరంగా గాలింపుచర్యలు కొనసాగిస్తున్నారు.






