- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కట్టడికి.. సూర్యాపేటకు ప్రత్యేకాధికారి నియామకం
by Shyam |
<p>దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకాధికారిగా జీ వేణుగోపాల్‌రెడ్డిని నియమిస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. కరోనా తీవ్ర స్థాయిలో […]</p>

X
దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకాధికారిగా జీ వేణుగోపాల్‌రెడ్డిని నియమిస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. కరోనా తీవ్ర స్థాయిలో ప్రబలుతున్నందున వేణుగోపాల్ రెడ్డి హుటాహుటిన సూర్యాపేటకు బయల్దేరారు.
Tags: suryapet, special officer, cs somesh kumar, corona effect
Next Story






