మహిళల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు 

by  |
మహిళల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు 
X

దిశ, మహబూబ్‎నగర్: శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ పూర్తిస్థాయి నిబద్ధతతో పని చేస్తుందని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ముఖ్యంగా మహిళల సంరక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గృహ హింస, మహిళల వేధింపుల విషయంలో సంబంధిత పోలీసు అధికారులు వేగంగా స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ‘మీ పోలీసు-మీ ఆత్మబంధువు’ పేరుతో ఫిర్యాదుదారుల ఇంటి వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి వివరించారు.

tag: SP Rema Rajeshwari, Comments, Special measures, women safety, mahabubnagar


Next Story