- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేనేతలను ఆదుకోవాలి
by Shyam |
<p>దిశ, మునుగోడు: చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం వెయ్యి కోట్లతో ప్రత్యేక సహాయ నిధిని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద గత ఆరు రోజులుగా కొనసాగుతున్న చేనేతల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. కరోనా సంక్షోభంలో చేతివృత్తుల వారిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకున్నాయని అదే విధంగా […]</p>

X
దిశ, మునుగోడు: చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం వెయ్యి కోట్లతో ప్రత్యేక సహాయ నిధిని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద గత ఆరు రోజులుగా కొనసాగుతున్న చేనేతల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు.
కరోనా సంక్షోభంలో చేతివృత్తుల వారిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకున్నాయని అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరారు. ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు పదివేల రూపాయలను అందించాలని డిమాండ్ చేశారు. 50% సబ్సిడీతో ముడిసరుకులను, చేనేత వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.
Next Story






