పశు వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్.. ఆ నెంబర్‌కు కాల్ చేస్తే క్షణాల్లో..

106

దిశ, కొత్తగూడ: పశు సంరక్షణకై పశు వైద్య సంచార వాహనాన్ని కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలో సేవలు అందించడం కోసం ప్రారంభించారు. ఇరు ఏజెన్సీ మండలాల్లోని పలు గ్రామాల్లో పశువులకు వ్యాధులు సంక్రమిస్తే, అందుబాటులో సరైన వైద్యం అందక ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడేవి. ఈ సంచార పశు వైద్య అంబులెన్స్ రాకతో ఆ కష్టాలు తీరనున్నాయి. 1962 నెంబర్‎కి కాల్ చేస్తే సంచార పశు వైద్య అంబులెన్స్ మీ వాకిట్లోకి వచ్చి వైద్యం అందిస్తుంది. రైతులకు సంచార పశువైద్యం వల్ల ఎంతో మేలు కలగనుంది. ఒక్క ఫోన్ కాల్‎తో సరిగ్గా మంద వద్దకు అంబులెన్స్‌ వెళ్లి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించనుంది. గ్రామాల నుంచి పశువులను తీసుకుని వైద్యశాలకు వెళ్లలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.1962 వాహనంలో అన్ని రకాల జంతువులకు ఉచితంగా సేవలు అందజేస్తారు. ఈ వాహనంలో డాక్టర్, వెటర్నరీ అసిస్టెంట్, కెప్టెన్, అటెండర్ అందుబాటులో ఉంటారు. ఈ కార్యక్రమంలో నెహ్రు నాయక్, శరణ్య, పాలడుగుల రవి తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..