చంద్రబాబు అలా ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి: స్పీకర్ తమ్మినేని

by srinivas |
tammineni sitaram
X

దిశ, ఏపీ బ్యూరో: శాసనసభలో తన సతీమణిని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా ముందు బోరున విలపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం తొలిసారి స్పందించారు. అసెంబ్లీ సమావేశంలో సభలో లేని మహిళల ప్రస్తావన ఎక్కడా రాలేదని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు ఎందుకు అలా చేశారో ఆయనకే తెలియాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత వ్యవహారాలు సభ ముందు పెట్టడం మంచిది కాదని హితవు పలికారు.

సభలో అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నామని చెప్పిన ఆయన చంద్రబాబుకు మైక్‌ ఇవ్వడం లేదని అనడం బాధాకరమన్నారు. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భావోద్వేగానికి గురైన చంద్రబాబు.. మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడితే సీఎంగానే అంటూ బయటకు వచ్చేశారు. అనంతరం తన సతీమణిని అవమానించారని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగిన విషయం తెలిసిందే.

Next Story