యాసంగిలో త్వరగా సాగు మొదలు పెట్టాలి

5

దిశ, వెబ్‌డెస్క్: యాసంగిలో రైతులు త్వరగా సాగు మొదలు పెట్టాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… మార్చినెలలోనే పంట కోతల్ని పూర్తి చేయాలని తెలిపారు. వచ్చే ఏడాది నిజాంసాగర్‌ను కాళేశ్వరం నీటితో నింపుతామని స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటలను దళారులకు అమ్ముకోవద్దని అన్నారు. రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిజాంసాగర్ నిండినందున ఈ రబీ, ఖరీఫ్ పంటలకు నీరందిస్తామని అన్నారు.