- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీధుల్లో ముద్దులు, హగ్గులు.. వీరి ఆనందానికి కారణం ఏంటో తెలుసా..?
<p>దిశ, వెబ్‌డెస్క్: అర్ధరాత్రి సమయం 11 గంటలు.. వీధులన్నీ యువతీయువకులతో నిండిపోయింది. ముద్దులు, హగ్గులు, పెగ్గులు.. ఓ గోల గోలగా ఉంది.. అంతలోనే అక్కడికి పోలీసులు వచ్చారు. అయినా వారిని అరెస్ట్వా చేయలేదు.. కనీసం ఒక్కమాట కూడా అనలేదు. అరే.. ఇదేంటి కరోనా సమయంలో పార్టీలు చేసుకుంటున్న వారిని అరెస్ట్ చేయకుండా.. పోలీసులు సైలెంట్ గా ఉండడం ఏంటి అనుకుంటున్నారా..? ఆ పార్టీకి ఒక కారణముంది మరీ.. ఇంతకీ వారు అలా రోడ్లమీద సంతోషంగా గంతులేయడానికి కారణమేంటో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: అర్ధరాత్రి సమయం 11 గంటలు.. వీధులన్నీ యువతీయువకులతో నిండిపోయింది. ముద్దులు, హగ్గులు, పెగ్గులు.. ఓ గోల గోలగా ఉంది.. అంతలోనే అక్కడికి పోలీసులు వచ్చారు. అయినా వారిని అరెస్ట్వా చేయలేదు.. కనీసం ఒక్కమాట కూడా అనలేదు. అరే.. ఇదేంటి కరోనా సమయంలో పార్టీలు చేసుకుంటున్న వారిని అరెస్ట్ చేయకుండా.. పోలీసులు సైలెంట్ గా ఉండడం ఏంటి అనుకుంటున్నారా..? ఆ పార్టీకి ఒక కారణముంది మరీ.. ఇంతకీ వారు అలా రోడ్లమీద సంతోషంగా గంతులేయడానికి కారణమేంటో తెలుసా… 6 నెలల నుండి అమలవుతున్న లాక్ డౌన్ ని ఎత్తివేయడమే. కరోనా కారణంగా స్పెయిన్ లో గత 6 నెలలు నుండి లాక్ డౌన్ నడుస్తుంది.
Maskless revelers partied in Barcelona as a curfew ended in most of Spain, but others feared it was too soon to let go https://t.co/Q4BPBFPLF6 pic.twitter.com/BQdP4CXXcs
— Reuters (@Reuters) May 11, 2021
ప్రతి ఒక్కరు ఇళ్లల్లోనే ఉండి , బయట ప్రపంచానికి దూరంగా ఉన్నారు. బంధువులు, స్నేహితులను చాలా మిస్ అయ్యారు. ఇక కొన్ని రోజుల నుండి స్పెయిన్ లో కరోనా కేసులు తగ్గడంతో స్పెయిన్ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసింది. ఇక అంతే .. అందరు వీధుల్లో చేరి పార్టీ చేసుకున్నారు. తమకిష్టమైన వారిని కలుసుకొని ముద్దులు , హగ్గులు ఇస్తూ పెగ్ వేస్తూ చిల్ అయ్యారు. అంతేకాకుండా రాత్రి సరిగ్గా 12 గంటలకు స్వాతంత్రం వచ్చిన వాళ్ళలాగా గో కరోనా.. గో గో కరోనా అంటూ గట్టిగట్టిగా కేకలు వేశారు. వీరి కేకలకు స్పెయిన్ దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఓరీ .. మీ ఆనందం తగలెయ్య.. లాక్ డౌన్ పోయిందని సంతోషించండి .. మళ్లీ ఇలా పార్టీలు, పబ్ లు అని తిరిగితే వెళ్లిన కరోనా మళ్లీ వస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.






