- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారిని కాపాడాల్సిన బాధ్యత పోలీస్ శాఖదే : SP
<p>దిశ, కోదాడ: కోదాడ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్‌ను సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పౌరులకు విలువైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే సమాజంలో పోలీసు శాఖకు మంచిపేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయిలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే క్రమంలో పట్టణంలో పూర్తిస్థాయిలో […]</p>

దిశ, కోదాడ: కోదాడ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్‌ను సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పౌరులకు విలువైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే సమాజంలో పోలీసు శాఖకు మంచిపేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయిలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే క్రమంలో పట్టణంలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోనే నేరాలను అరికట్టవచ్చని, అంతేగాకుండా దర్యాప్తులో కెమెరాలు పాత్ర కీలకంగా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం గంజాయి మహమ్మారి ప్రధాన సమస్యగా ఉందని, పోలీసులు పట్టుదలతో పనిచేసి గంజాయి మూలాలను గుర్తించి పూర్తిస్థాయిలో నిర్మూలించాలని కోరారు. గంజాయి బారినుండి యువతను సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పోలీస్ శాఖపై ఉందని ఆయన సూచించారు. ఆయన వెంట పట్టణ సీఐ నరసింహ రావు, పోలీసు సిబ్బంది ఉన్నారు.






