- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
<p>దిశప్రతినిధి, కరీంనగర్ : రామగుండం పోలీసు కమిషనర్‌గా సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట నాన్ కేడర్ ఎస్పీ అయిన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రమణ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సీనియార్టీ ప్రాతిపాదిక అంశం తెరపైకి రావడంతో పాటు మరిన్ని కారణాల దృష్ట్యా ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఫైనల్‌గా రమణ కుమార్‌ను సంగారెడ్డి ఎస్పీగా నియమిస్తూ ఆదేశాలు […]</p>

X
దిశప్రతినిధి, కరీంనగర్ : రామగుండం పోలీసు కమిషనర్‌గా సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట నాన్ కేడర్ ఎస్పీ అయిన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రమణ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, సీనియార్టీ ప్రాతిపాదిక అంశం తెరపైకి రావడంతో పాటు మరిన్ని కారణాల దృష్ట్యా ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఫైనల్‌గా రమణ కుమార్‌ను సంగారెడ్డి ఎస్పీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదిలాఉండగా, ఐదేండ్ల సర్వీస్ పూర్తయిన కారణంగా కరీంనగర్ సీపీ కమల్‌హాసన్ రెడ్డి డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడగా.. ఆయన స్థానంలోకి రామగుండం కమిషనర్ సత్యనారాయణ వెళ్లిన విషయం తెలిసిందే.
Next Story






