- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పోలీసులు మహానుభావులు : ఎస్పీ చందనా దీప్తి
<p>దిశ, మెదక్: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని మెదక్ ఎస్పీ చందనా దీప్తి కొనియాడారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్, ఎస్పీ, అదనపు ఎస్పీ ఘనంగా నిరవాళులర్పించారు. అనంతరం ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తున్న క్రమంలో ప్రాణాలు అర్పించిన పోలీసులు […]</p>

దిశ, మెదక్: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని మెదక్ ఎస్పీ చందనా దీప్తి కొనియాడారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్, ఎస్పీ, అదనపు ఎస్పీ ఘనంగా నిరవాళులర్పించారు. అనంతరం ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తున్న క్రమంలో ప్రాణాలు అర్పించిన పోలీసులు మహానుభావులని అభిప్రాయపడ్డారు. పోలీసు అమరవీరులు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. పోలీసు అమరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు మన మధ్య లేకున్నా మనం వారిని స్మరిస్తూనే ఉంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. అనంతరం విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయిన 14 మంది మెదక్ జిల్లా అమరవీరుల కుటుంబాలను అదనపు ఎస్పీ కృష్ణమూర్తి పరామర్శించారు. ఈ కుటుంబాలను పోలీసు వ్యవస్థ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎంఏ రజ్జాక్, డీఎస్పీలు కిరణ్ కుమార్, సైదులు, సీఐలు వెంకట్, పాలవెల్లితో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






