యంగ్ టాలెంట్‌కు రానా ప్రోత్సాహం

by  |
యంగ్ టాలెంట్‌కు రానా ప్రోత్సాహం
X

దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తానెప్పుడూ ముందుటానని చెప్పే టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి.. తన మాట నిలబెట్టుకుంటూ ఇండస్ట్రీలో కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నాడు. నటుడినే కాకుండా తనలోని భిన్నకోణాలను ఆవిష్కరించే దిశగా హోస్ట్‌గా, యాంకర్‌గా, యూట్యూబర్‌గానూ ముందుకు సాగుతున్న రానా.. తన యూట్యూబ్ చానల్‌ ‘సౌత్ బే’తో ప్రతిభావంతులను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ మ్యూజిక్ లేబుల్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

రానా తన ‘సౌత్‌ బే’ యూట్యూబ్‌ చానల్‌ ద్వారా సెలెబ్రిటీల ఇంటర్వ్యూలు అందిస్తున్న విషయం తెలిసిందే. అతి తక్కువ కాలంలోనే ఈ చానల్ మంచి గుర్తింపు తెచ్చుకోగా, లీడింగ్ డిజిటల్‌ మ్యూజిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ‘బిలీవ్‌’.. ‘సౌత్‌ బే’తో ఎక్స్‌క్లూజివ్‌ డిస్ట్రిబ్యూషన్‌‌కు అగ్రిమెంట్‌ చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘ప్రతిభ ఉన్నవారికి అవకాశం కల్పిచడంతో పాటు క్వాలిటీ కంటెంట్ అందివ్వడంపై దృష్టిపెట్టబోతున్నాం. సంగీత ప్రపంచంలో ఇదో కొత్త దారి’ అని రానా వెల్లడించారు.


Next Story

Most Viewed