BCCI : సౌతాఫ్రికాలో కోహ్లీసేన.. బిగ్ బాంబ్ పేల్చిన గంగూలీ

by  |
BCCI : సౌతాఫ్రికాలో కోహ్లీసేన.. బిగ్ బాంబ్ పేల్చిన గంగూలీ
X

దిశ, వెబ్‌డెస్క్ : కెప్టెన్సీ వివాదం భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. కోహ్లీ, బీసీసీఐ చీఫ్ గంగూలీ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు స్పందిస్తూ ఈ వివాదానికి తెరపడాలంటే గంగూలీ, కోహ్లీ ఇద్దరు కలిసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం గంగూలీ మీడియా వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గురు‌గ్రామ్‌లో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గంగూలీ.. టీమిఇండియా ఆటగాళ్లలో ఎవరి వైఖరంటే ఇష్టమని అడిగిన ప్రశ్నకు.. విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ అంటే ఇష్టం, కానీ ఈ మధ్య తను చిక్కుల్లో పడుతున్నాడని బాంబ్ పేల్చాడు. ఇదే క్రమంలో మీరు ఒత్తిడిని ఎలా జయిస్తారని అడిగిన మరో ప్రశ్నకు దాదా సమాధానం చెబుతూ.. జీవితంలో అసలు ఒత్తిడి అనేదే లేదు.. గర్ల్​ఫ్రెండ్, భార్య వల్లే ఒత్తిడి వస్తుందని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.

ఇదిలా ఉండగా టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. టెస్టు సిరీస్ కోసం కోహ్లీసేన నెట్స్‌లో కసరత్తు ప్రారంభించింది. ఆ దేశ పరిస్థితులకు అలవాటు పడేందుకు సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండే ప్రాంతంలో కోహ్లీసేన ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం. టీమిండియా ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ విడుదల చేసింది.



Next Story

Most Viewed