గంగూలీకి మరోసారి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు

by Vadlamudi Anukaran |   (  Updated:2021-01-27 04:23:36  IST  )

<p>దిశ,వెబ్‌డెస్క్: బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. స్వల్పంగా ఛాతీ నొప్పిరావడంతో  కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. జనవరి 2న గుండెపోటు రావడంతో  గంగూలీని కోల్‌కతాలోని వుడ్ ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు..ఆయన గుండెలోని మూడు ధమనులల్లో బ్లాకేజ్ కనిపించినట్లు గుర్తించారు. ఓ ధమని ఏకంగా 90శాతం వరకు మూసుకుపోవడంతో ఆయనకు స్టెంట్ వేశారు.  ఐదు రోజుల చికిత్స అనంతరం జనవరి 7న గంగూలీ డిశ్చార్జి అయ్యారు. ఇక అంతా [&hellip;]</p>

గంగూలీకి మరోసారి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు
X

దిశ,వెబ్‌డెస్క్: బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. స్వల్పంగా ఛాతీ నొప్పిరావడంతో కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. జనవరి 2న గుండెపోటు రావడంతో గంగూలీని కోల్‌కతాలోని వుడ్ ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు..ఆయన గుండెలోని మూడు ధమనులల్లో బ్లాకేజ్ కనిపించినట్లు గుర్తించారు. ఓ ధమని ఏకంగా 90శాతం వరకు మూసుకుపోవడంతో ఆయనకు స్టెంట్ వేశారు. ఐదు రోజుల చికిత్స అనంతరం జనవరి 7న గంగూలీ డిశ్చార్జి అయ్యారు. ఇక అంతా బాగుందనుకున్న వేళ బుధవారం మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు.

Next Story