- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యాధునిక సదుపాయాలతో కూకట్పల్లి పీఎస్
<p>దిశ, హైదరాబాద్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు సత్వరమే సేవలందిచేందుకు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ను అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన కూకట్పల్లి నూతన పోలీస్ స్టేషన్ను.. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి సీపీ సజ్జనార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన క్యాంప్ కార్యాలయం కోసం […]</p>

దిశ, హైదరాబాద్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు సత్వరమే సేవలందిచేందుకు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ను అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన కూకట్పల్లి నూతన పోలీస్ స్టేషన్ను.. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి సీపీ సజ్జనార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన క్యాంప్ కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని పోలీస్ స్టేషన్కు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ సందర్శంగా ఎమ్మెల్యే కృష్ణారావును సీపీ శాలువాతో సత్కరించారు. రానున్న రోజుల్లో కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్, మోతినగర్ పోలీస్ స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేకంగా నిర్మిస్తామని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ వెంకటేశ్వరరావు, మాదాపూర్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీలు సురేందర్ రావు, భుజంగరావు, కూకట్ పల్లి సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






