- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.100 కోట్లు దాటిన ‘సూర్యవంశీ’.. ఆనందంలో అక్షయ్
<p>దిశ, సినిమా: రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘సూర్యవంశీ’. దివాళీ సందర్భంగా రిలీజై, భారీ కలెక్షన్లతో దూసుకుపోతూ రూ.100 కోట్ల మార్క్ చేరుకోగా.. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోగా రూ.120 కోట్లు క్రాస్ చేస్తుందని మూవీ యూనిట్ అంచనా వేస్తోంది. ఇదే క్రమంలో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న మేకర్స్.. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌తో సంప్రదింపులు జరిపినట్లు టాక్. ఈ మేరకు డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో […]</p>

దిశ, సినిమా: రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘సూర్యవంశీ’. దివాళీ సందర్భంగా రిలీజై, భారీ కలెక్షన్లతో దూసుకుపోతూ రూ.100 కోట్ల మార్క్ చేరుకోగా.. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోగా రూ.120 కోట్లు క్రాస్ చేస్తుందని మూవీ యూనిట్ అంచనా వేస్తోంది. ఇదే క్రమంలో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న మేకర్స్.. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌తో సంప్రదింపులు జరిపినట్లు టాక్. ఈ మేరకు డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇక ‘సూర్యవంశీ’ చిత్రాన్ని ఆదరించినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాలో గూఫీ వీడియో షేర్ చేసిన అక్షయ్.. ‘ఇలా గూఫీ గిగ్ చేసినందుకు క్షమించండి. నేను ఆనందంలో మునిగితేలుతున్నాను. సూర్యవంశీని పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ’ అని పోస్ట్ చేశాడు.
https://www.instagram.com/reel/CV5PBq6FWB9/?utm_source=ig_web_copy_link






