ఆస్కార్స్‌కు ‘సురారై పోట్రు’

by  |
ఆస్కార్స్‌కు ‘సురారై పోట్రు’
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో సూర్య లేటెస్ట్ మూవీ ‘సురారై పోట్రు’ ఆస్కార్ నామినేషన్స్‌కు సెలెక్ట్ అయింది. జనరల్ కేటగిరిలో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, ఒరిజినల్ స్కోర్‌తో పాటు ఇతర కేటగిరీల్లోనూ నామినేట్ అయింది. కెప్టెన్ గోపీనాథ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమాకు సుధా కొంగర దర్శకులు కాగా హీరో సూర్య, హీరోయిన్ అపర్ణా బాలమురళి నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన సినిమా సూపర్ డూపర్ సక్సెస్ కాగా జీవీ ప్రకాశ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సూపర్ కాంప్లిమెంట్స్ అందాయి. కాగా ఈ సినిమా ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ అయింది.

కాగా ఈ సినిమా పలు విభాగాల్లో ఆస్కార్ బరిలో నిలిచినట్టు సినిమా సహ నిర్మాత రాజశేఖర్ పాండ్యా తెలిపారు. ఈ సినిమాను అస్కార్ అకాడమీ స్క్రీనింగ్ రూమ్ వారు మంగళవారం రివ్యూ చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఆ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదిక ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో షేర్ చేయగానే పెద్ద ఎత్తున అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.



Next Story

Most Viewed