మహిళా డైరెక్టర్ కోసం సోనుసూద్ కొత్త అవతారం..

113
sonusood-fara

దిశ, సినిమా : యాక్టర్ సోనుసూద్, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్.. ఓ మ్యూజిక్ వీడియో ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఫరా దర్శకత్వం వహిస్తున్న ఈ సాంగ్ షూటింగ్ పంజాబ్‌లో ఇప్పటికే మొదలైంది. కాగా గతంలో ఈ లేడీ డైరెక్టర్‌ తీసిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలో కనిపించిన సోను.. మళ్లీ తనతో వర్క్ చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి పాటలో నటించలేదని, ఇందులో ఏదో కొత్తదనం ఉందని చెప్పాడు. ఇక సాంగ్ స్టోరీ విషయానికొస్తే.. పోలీస్‌గా మారిన ఓ రైతు పాత్రలో తాను కనిపించనున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఈ నెలాఖరున విడుదలవుతుందని వెల్లడించాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..