- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బాధ్యత పెరిగింది : సోనూ
దిశ, వెబ్‌డెస్క్: లాక్ డౌన్‌లో సోనూసూద్ చేసిన సహాయ కార్యక్రమాలు ఆయన్ను హీరోగా నిలబెట్టాయి. బిగ్ స్క్రీన్ విలన్ ఇంటర్నెట్‌లో రియల్ హీరో అయిపోయాడు. మాటిచ్చినట్లుగా ఇప్పటికీ కూడా తన సహాయాన్ని కొనసాగించేందుకు ఏకంగా ప్రాపర్టీనే తాకట్టుపెట్టాడు సోనూ. మరి అలాంటి సోనూ తెరమీద మళ్లీ విలన్ క్యారెక్టర్స్ చేస్తే ఏం బాగుంటుంది? అసలు మనం యాక్సెప్ట్ చేయగలమా? ముఖ్యంగా తన హెల్ప్‌తో లైఫ్ లీడ్ చేస్తున్న వారు ఒప్పుకుంటారా? లేదు కదా. అందుకే డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లు కూడా సోనూను చూసే విధానంలో తమ దృష్టి కోణాన్ని మార్చుకున్నారు.
డిఫరెంట్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు. విలన్‌గా కాకుండా రియల్ లైఫ్ హీరో రోల్స్ ప్లే చేసేందుకు తనను ఆశ్రయిస్తున్నారు. నిజజీవితంలో జరిగిన విషయాలను స్క్రిప్ట్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తుండగా..వారి అంచనాలను అందుకునేలా జీవిస్తానని చెప్తున్నారు సోనూ. కొత్త పాత్రలు, కొత్త కథలు వస్తున్నాయని..ఇప్పుడు తన మీద చాలా పెద్ద బాధ్యత ఉందని చెప్పారు. యాక్టర్‌గా మారేందుకు ముంబైకి వచ్చానని..తను ఎక్కువగా ఇష్టపడేది కూడా అదేనని.. తప్పకుండా కంటిన్యూ చేస్తానని చెప్పాడు సోనూ.