ఐఏఎస్ ఆస్పిరెంట్స్‌కు సోను స్కాలర్‌షిప్స్

7

దిశ, వెబ్‌డెస్క్ :
నటుడు సోనూసూద్ మరో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తల్లి సరోజ్ సూద్ వర్ధంతిని పురస్కరించుకుని ఐఏఎస్ అధికారులు కావాలనుకుంటున్న వారికి ఆర్థిక సాయం చేయడానికి మద్దతిస్తానని ప్రకటించాడు. తమ లక్ష్యాలను చేరుకునేందుకు సరోజ్ సూద్ స్కాలర్ షిప్‌లు అందించనున్నట్లు తెలిపాడు. అమ్మ వదిలేసిన విద్యా వారసత్వాన్ని కొనసాగించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నానికి అమ్మ దీవెనలు కోరుతూ ట్వీట్ చేశాడు.

ఈ స్కాలర్‌షిప్స్ కోసం స్కాలిఫై యాప్ ( SCHOLIFY APP) లేదా WWW.SCHOLIFYME.COM వెబ్‌సైట్‌లో అప్లయ్ చేసుకోవాలని సూచించాడు.

https://twitter.com/SonuSood/status/1315915235417440256?s=19