సోనూ సాయం.. అండగా నిలిచిన చంద్రబాబు

by  |
సోనూ సాయం.. అండగా నిలిచిన చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్‌ చేస్తున్న సేవలకు ప్రజానీకం చేతులెత్తి మొక్కుతుంది. అతడు చేస్తున్న సేవలకు ఒక్కొక్కరికి నోటి నుంచి మాట కూడా రావడం లేదు. కష్టంలో ఉన్న ప్రతీ ఒక్కరికి సోనూ సూద్ వరాలిచ్చే దేవుడయ్యాడు.

రీల్ విలన్ రియల్ హీరోగా మారి.. ప్రజాప్రతినిధుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు కుటుంబానికి సోనూ సూద్ ట్రాక్టర్ పంపడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. సోనూ సూద్ సేవలు స్ఫూర్తిదాయకమన్న చంద్రబాబు ఆ ఇద్దరు అక్కా చెల్లెల్లకు అవసరమైన చదువు ఫీజులు మొత్తం టీడీపీ భరిస్తోందని హామీ ఇచ్చారు.

అయితే, చంద్రబాబు ట్వీట్‌కు సోనూ సూద్ కూడా రీట్వీట్ చేశారు. తనను ప్రశంసించినందుకు చంద్రబాబుకు ధన్యావాదాలు తెలిపారు. మీ దయతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పేదవారికి సహాయం చేసేలా ఉందన్నారు. మీ మార్గదర్శకంలో లక్షలాది మంది వారి కలలను సాకారం చేసుకుంటారని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సోనూ ఆకాంక్షించారు. త్వరలో చంద్రబాబును కలిసి సమావేశం అవుతానంటూ సోనూ సూద్ ట్వీట్ చేశారు.

కాగా, రైతు నాగేశ్వర రావు ఎద్దులు లేని దుస్థితిలో తన కూతుళ్లతో పొలం దున్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన సోనూ సూద్ వారికి తొలుత రెండు ఎద్దులను కొనిస్తానని చెప్పాడు. ఆ తర్వాత ట్రాక్టర్ మీ ఇంటి ముందుకు వస్తుంది వారికి తెలిపాడు. ఈ మాట చెప్పిన గంటల వ్యవధిలోనే ఆ ఇంటికి సోనాలిక ట్రాక్టర్‌ను పంపించాడు. దీంతో నాగేశ్వరరావు కుటుంబం ఆనందంతో సోనూ సూద్ కు ధన్యవాదాలు తెలిపారు.


Next Story

Most Viewed