బ్లైండ్ ట్రైనింగ్‌లో.. సోనమ్

by  |
బ్లైండ్ ట్రైనింగ్‌లో.. సోనమ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ చార్మింగ్ బ్యూటీ సోనమ్ కపూర్‌ను బిగ్ స్క్రీన్ మీద చూసి చాలా కాలమైంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌ మూవీ ‘ఏకే వర్సెస్ ఏకే’లో కనిపించిన ఈ ఫ్యాషన్ ఐకాన్.. తాజాగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘బ్లైండ్’ వివరాలు వెల్లడించింది. థ్రిల్లర్స్ మూవీస్‌ను అందించే సుజయ్ ఘోష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దీని కోసం సోనమ్ రియల్ లైఫ్ విజువల్లీ ఇంపెయిర్డ్ కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపాడు.

2011లో సౌత్ కొరియాలో వచ్చిన ‘బ్లైండ్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనమ్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్‌గా చేస్తుండగా, ఓ ట్రాజిక్ యాక్సిడెంట్ కారణంగా తన చూపు కోల్పోతుంది. ఈ క్రమంలో ఓ ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు సోనమ్‌ను సంప్రదించగా.. వారితో కలిసి ఆ కేసును ఎలా సాల్వ్ చేసిందనేదే కథ. కెరీర్‌లో తొలిసారి అంధురాలిగా నటిస్తున్న సోనమ్.. పాత్రకు న్యాయం చేసేందుకు బ్లైండ్ పర్సన్ దగ్గర శిక్షణ తీసుకున్నట్లు ఫిల్మ్ మేకర్స్ వెల్లడించారు.

ఈ చాలెంజింగ్ రోల్‌కు సోనమ్ 100 శాతం న్యాయం చేసిందని, అంధురాలిగా పర్‌ఫెక్షన్ కోసం ఎంతో కష్టపడిందని నిర్మాత సుజయ్ తెలిపాడు. కాగా ఈ సినిమాకు షోమే మాఖిజా దర్శకత్వం వహిస్తున్నారు. సుజయ్ ఘోష్ థ్రిల్లర్స్‌లానే ఈ సినిమా కూడా ప్రేక్షకులను చివర వరకు ఉత్కంఠకు గురిచేస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed