- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొనాలిక ట్రాక్టర్స్ రికార్డు స్థాయి అమ్మకాలు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అసాధారణ పనితీరును కనబరిచిన ప్రముఖ ట్రాక్టర్ తయారీ సంస్థ సోనాలిక ట్రాక్టర్స్ జూలై నెలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. సమీక్షించిన నెలలో కంపెనీ రికార్డు స్థాయిలో 5.2 శాతం వృద్ధితో 10,756 ట్రాక్టర్లను విక్రయించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గానూ, ఉత్తమ ఎగుమతిదారుగా సోనాలిక్ నిలిచిందని, తమ పోర్ట్‌ఫోలియోలో అత్యాధునిక సాంకేతికతతో తెచ్చిన ట్రాక్టర్ల ద్వారా ఈ బలమైన […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అసాధారణ పనితీరును కనబరిచిన ప్రముఖ ట్రాక్టర్ తయారీ సంస్థ సోనాలిక ట్రాక్టర్స్ జూలై నెలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. సమీక్షించిన నెలలో కంపెనీ రికార్డు స్థాయిలో 5.2 శాతం వృద్ధితో 10,756 ట్రాక్టర్లను విక్రయించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గానూ, ఉత్తమ ఎగుమతిదారుగా సోనాలిక్ నిలిచిందని, తమ పోర్ట్‌ఫోలియోలో అత్యాధునిక సాంకేతికతతో తెచ్చిన ట్రాక్టర్ల ద్వారా ఈ బలమైన అమ్మకాలను సాధించినట్టు కంపెనీ వెల్లడించింది.
వరుసగా రెండో ఏడాది ఋతుపవనాలు, వాతావరణ పరిస్థితులు సానుకూలంగా ఉండటం గ్రామీణ ఆర్థికవ్యవస్థలో ఉపశమనం కలిగించాయని కంపెనీ అభిప్రాయపడింది. గ్రామీణ పరిస్థితులకు, రైతుల అవసరాలకు తగిన రీతిలో ఉత్పత్తులను రూపొందిస్తున్నామని, కొత్త టెక్నాలజీతో తయారీని నిర్వహించడం ద్వారా కంపెనీ ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోందని వివరించింది. ‘రైతుల అవసరాలను గుర్తించి, వారు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించే స్థాయిలో ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఈ కారణంగానే ఇటీవల కాలంలో అసాధారణ అమ్మకాలు సాధించగలిగాం. కంపెనీ నుంచి కస్టమైజ్‌డ్ హెవీ డ్యూటీ ట్రాక్టర్లను తీసుకురావడంతో తమ పోర్ట్‌ఫోలియో రైతుల విశ్వాసాన్ని సాధించిందని, ఈ సందర్భంగా రైతులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. రైతుల వ్యవసాయ అవసరాల్లో గణనీయమైన మార్పు వచ్చాయి. అత్యాధునిక ట్రాక్టర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని కొత్త ట్రాక్టర్ల ఉత్పత్తి చేపడతామని’ సోనాలిక ట్రాక్టర్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ్ మిట్టల్ వెల్లడించారు.






