- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే: సోనాక్షి
<p>దబాంగ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా.. తొలి సినిమాతోనే బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా ఫిల్మ్ ఫేర్ అందుకుంది. ఆ తర్వాత రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, దబాంగ్ 2, హాలీడే చిత్రాలతో వరస విజయాలను సొంతం చేసుకుంది. ‘లూటేరా’ సినిమాలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ క్రమంలోనే సోనాక్షి.. రొమాంటిక్ హీరో షాషిద్ కపూర్‌తో ‘ఆర్ రాజ్ కుమార్’ అనే సినిమాలో నటించింది. ఆ సమయంలోనే వీళ్లు […]</p>

దబాంగ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా.. తొలి సినిమాతోనే బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా ఫిల్మ్ ఫేర్ అందుకుంది. ఆ తర్వాత రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, దబాంగ్ 2, హాలీడే చిత్రాలతో వరస విజయాలను సొంతం చేసుకుంది. ‘లూటేరా’ సినిమాలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ క్రమంలోనే సోనాక్షి.. రొమాంటిక్ హీరో షాషిద్ కపూర్‌తో ‘ఆర్ రాజ్ కుమార్’ అనే సినిమాలో నటించింది. ఆ సమయంలోనే వీళ్లు ప్రేమలో పడ్డారని, డేటింగ్ కూడా చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే షాహిద్ కపూర్ 2015లో తన స్నేహితురాలు మీరా రాజ్ పుత్‌ను వివాహం చేసుకోవడంతో ఆ రూమర్లకు కాస్త తెరపడింది. అయితే అప్పటి రూమర్లపై సోనాక్షి తాజాగా స్పందించింది.
‘షాహిద్ కపూర్ ఇప్పటికీ తనకు మంచి స్నేహితుడని, ఇలాంటివి విని మేం నవ్వుకునేవాళ్లమని చెప్పింది. పెళ్లికాని ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తున్నప్పుడు ఇలాంటి రూమర్స్ రావడం సహజమని అన్నారు. అయినా ఇలాంటి రూమర్లను నేనసలు పట్టించుకోనని, ఎవరో కావాలని సృష్టించే అర్థంపర్థం లేని రూమర్స్ నన్ను బాధించవు’ అని సోనాక్షి పేర్కొంది.






