SEX వర్కర్‌‌గా సోనాక్షి సిన్హా..

by  |
sonakishi-sinha
X

దిశ, సినిమా : ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ మధ్యే ‘గంగుబాయి కతియావాడి’ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం ‘హీరా మండి’ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ కోసం కాస్ట్ అండ్ క్రూ సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే హీరోయిన్ హ్యూమా ఖురేషిని ఫైనల్ చేసిన భన్సాలీ.. తాజాగా ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హాను లీడ్ రోల్‌కు ఎంపిక చేసినట్లు బీటౌన్ టాక్.

ఫాదర్ శతృఘ్న సిన్హా సోనాక్షి భన్సాలీ డైరెక్షన్‌లో పనిచేయాలని కోరుకుంటున్నాడని, ఆ కారణంతోనే సెలక్ట్ చేశారని తెలుస్తోంది. ఇంతకు ముందు భన్సాలీ ప్రొడక్షన్స్‌లో ‘రౌడీ రాథోడ్’ సినిమా చేసిన సోనాక్షి.. ఇప్పుడు తన దర్శకత్వంలో సెక్స్ వర్కర్‌గా మెయిన్ క్యారెక్టర్ ప్లే చేయబోతోంది. ఇక ఈ రోల్‌కు తగ్గట్టు ఫిట్ అయ్యేలా ప్రిపరేషన్స్ కూడా మొదలు పెట్టేసిందట. దానికోసం కథక్ కూడా నేర్చుకుంటుందని సమాచారం. కాగా ‘హీరా మండి’ సిరీస్ కాన్సెప్ట్ ‘పాకీజా’ స్ఫూర్తితో తెరమీదకు వస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story