చెత్త.. చెత్తనే ప్రేమిస్తుంది: మ్యూజిక్ షోపై సింగర్ కామెంట్స్

by  |
చెత్త.. చెత్తనే ప్రేమిస్తుంది: మ్యూజిక్ షోపై సింగర్ కామెంట్స్
X

దిశ, సినిమా: హిట్ ట్రాక్స్‌తోనే కాకుండా కాంట్రవర్సీ కామెంట్లతోనూ పాపులర్ అయిన సింగర్ సోనా మోహపాత్ర.. మ్యూజిక్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్‌తో పాటు ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ అను మాలిక్‌ను విమర్శించింది. ఆయన ‘సీజన్ 12’కు జడ్జిగా తిరిగిరావడం పట్ల ట్విట్టర్ యూజర్ ఒకరు.. ‘సోనీ టీవీ మీటూ ఆరోపణల నుంచి అనుమాలిక్‌కు విముక్తి కల్పించినట్లుంది’ అంటూ సోన మోహపాత్రకు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన సింగర్ సోన.. ‘చెత్త, చెత్తనే ప్రేమిస్తుంది’ అంటూ ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. కాగా అతడు కొన్ని వారాల నుంచి ఈ మ్యూజిక్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

గతంలో #MeToo మూమెంట్‌ సందర్భంగా సింగర్ సోనతో పాటు నేహా భాసిన్, శ్వేత పండిట్ వంటి ఫేమస్ సింగర్లు తమను లైంగిక వేధించినట్టు మ్యూజిక్ కంపోజర్‌ అనుమాలిక్‌పై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే 2019లో ఆయన ఇండియన్ ఐడల్ జడ్జి స్థానం నుంచి తప్పుకున్నారు. ఆ టైమ్‌లో తనపై వచ్చిన ఎలిగేషన్స్‌ను ఖండిస్తూ మీడియాకు స్టేట్‌మెంట్ కూడా విడుదల చేశారు.


Next Story

Most Viewed