తల్లికి రెండోపెళ్లి చేసిన తొమిదేళ్ల కుమారుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by  |
తల్లికి  రెండోపెళ్లి చేసిన తొమిదేళ్ల కుమారుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లల మీద తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో.. పిల్లలకు కూడా తల్లిదండ్రుల మీద అంతే ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా తల్లి ప్రేమను ఎవరు వర్ణించలేరు.. తన తల్లిని ప్రేమించని పిల్లలు లోకంలో ఎక్కడా ఉండరు.. తల్లి సంతోషంగా ఉండాలని, ఆమె కష్టపడకుండా చూసుకోవాలని ప్రతి కొడుకు ఆరాటపడుతుంటాడు. అలాగే ఈ కొడుకు కూడా తన కన్నతల్లి సంతోషం కోరుకున్నాడు. కుటుంబ కలహాల వలన తండ్రితో విడిపోయి తల్లి ఒక్కత్తే తనను కష్టపడి పెంచడం చూశాడు. జీవితంలో ఆమె కోల్పోయిన ఆనందాన్ని తిరిగి ఇవ్వాలనుకున్నాడు. అంతే మారుమాట్లాడకుండా తల్లికి మరో వ్యక్తితో వివాహం చేయించేశాడు. దగ్గరుండి తన తల్లి వివాహం ఘనంగా జరిపించాడు. అయితే ఇంత విశాలంగా ఆలోచించింది ఏమైనా పెద్ద వయస్సున్న అబ్బాయి కాదు.. తొమ్మిదేళ్ల వయస్సున్న బాలుడు. ప్రస్తుతం ఈ పెళ్లి ఘటన నెట్టింట వైరల్ గా మారింది.

వివరాలలోకి వెళితే.. మధురై జిల్లా తెన్ కాశీకి చెందిన సుభాషిణి అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు తొమ్మిదేళ్ల కుమారుడు దర్శన్ ఉన్నాడు. భర్తతో కొన్నేళ్ల క్రితం విడిపోయిన సుభాషిణి అప్పటినుంచి కొడుకుతో కలిసి ఒంటరిగా ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆమెకు తిరుమంగళానికి చెందిన ఆదిష్ పరిచయమయ్యాడు. సినిమా రంగంలో చిత్రకారుడిగా పనిచేసే అతనితో సుభాషిణి ప్రేమలో పడింది. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ , వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. అయితే తన తల్లి ప్రేమను కుమారుడు దర్శన్ అర్ధం చేసుకున్నాడు. తన తల్లి సంతోషంగా ఉండాలని ఆమె ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలనుకున్నాడు.

తన తల్లి పెళ్లి చేసుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదని తెలిపాడు. దీంతో ఇరు కుటుంబాలు చిన్న పిల్లాడి మాటలకు షాక్ అయ్యి పెళ్ళికి సరే అన్నారు. ఇక దీంతో వారి పెళ్లి అంగరంగవైభవంగా జరిపించాడు. తన చేతుల మీదుగా మంగళసూత్రం అందించి తన తల్లి ప్రేమ వివాహం జరిపించి అందరి మన్ననలు పొందాడు. చిన్నవయసులో పెద్దమనసుతో తల్లి ఆనందం కోసం దర్శన్ చేయూత ఇవ్వడం స్థానికులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


Next Story

Most Viewed