- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబాయిని గొడ్డలితో నరికిన అన్నకొడుకు..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్ల పహాడ్ గ్రామంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో లచ్చయ్య(55)ను అతని అన్న కొడుకు వెంకన్న గొడ్డలితో నరికాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో లచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే..భూమి విషయంలో సొంత అన్నదమ్ముల కుటుంబాల మధ్య వివాదం గత కొంతకాలంగా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే లచ్చయ్యను అతని అన్న కొడుకు వెంకన్న గొడ్డలితో నరికి […]</p>
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్ల పహాడ్ గ్రామంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో లచ్చయ్య(55)ను అతని అన్న కొడుకు వెంకన్న గొడ్డలితో నరికాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో లచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే..భూమి విషయంలో సొంత అన్నదమ్ముల కుటుంబాల మధ్య వివాదం గత కొంతకాలంగా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే లచ్చయ్యను అతని అన్న కొడుకు వెంకన్న గొడ్డలితో నరికి చంపినట్టు స్థానికులు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Next Story






