- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన రెండో పెళ్లి..
<p>దిశ, జడ్చర్ల : కన్న కొడుకే తండ్రి పాలిట కాలయముడయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం కావేరమ్మపేట ప్రాంతానికి చెందిన మౌలానా (45)అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. కాగా మొదటి భార్య హైదరాబాద్‌లో నివాసముంటోంది. మౌలానా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ రెండో భార్యతో కలిసి కావేరమ్మపేటలో నివాసముంటున్నారు. కాగా, గత కొన్ని రోజుల నుంచి మొదటి భార్య కొడుకు ఇబ్రహీం తండ్రి మౌలానాతో తరచూ గొడవ పడుతున్నాడు. వివాదం తారాస్థాయికి చేరడంతో […]</p>

దిశ, జడ్చర్ల : కన్న కొడుకే తండ్రి పాలిట కాలయముడయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం కావేరమ్మపేట ప్రాంతానికి చెందిన మౌలానా (45)అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. కాగా మొదటి భార్య హైదరాబాద్‌లో నివాసముంటోంది. మౌలానా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ రెండో భార్యతో కలిసి కావేరమ్మపేటలో నివాసముంటున్నారు. కాగా, గత కొన్ని రోజుల నుంచి మొదటి భార్య కొడుకు ఇబ్రహీం తండ్రి మౌలానాతో తరచూ గొడవ పడుతున్నాడు.
వివాదం తారాస్థాయికి చేరడంతో మౌలానాపై ఇబ్రహీం కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం సాయంత్రం కావేరమ్మ పేటకు చెందిన మరో వ్యక్తి మనుబాబాతో కలిసి ప్లాన్ ప్రకారం మౌలానాను మెడపై కత్తితో నరికారు. తీవ్ర రక్తస్రామైన మౌలానా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.






