- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య ప్రసవం టైం.. తండ్రి కళ్లెదుటే కొడుకు మృతి
<p>దిశ, జవహర్ నగర్ : ఓ వైపు భార్య ప్రవసం కోసం తల్లిగారి ఇంటికి వెళ్లగా తండ్రి కళ్లెదుటే ప్రమాదంలో కొడుకు కన్నుమూశాడు. ఈ దారుణమైన ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా పరిగి ప్రాంతానికి చెందిన ఆంజనేయులు స్థానికంగా తోటకాపరిగా పనిచేస్తూ కుటుంబంతో కలిసి ఉంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం భార్య ప్రసవం కోసం తల్లిగారింటికి వెళ్లింది. ఆంజనేయులు తన తొమ్మిదేళ్ల […]</p>

దిశ, జవహర్ నగర్ : ఓ వైపు భార్య ప్రవసం కోసం తల్లిగారి ఇంటికి వెళ్లగా తండ్రి కళ్లెదుటే ప్రమాదంలో కొడుకు కన్నుమూశాడు. ఈ దారుణమైన ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా పరిగి ప్రాంతానికి చెందిన ఆంజనేయులు స్థానికంగా తోటకాపరిగా పనిచేస్తూ కుటుంబంతో కలిసి ఉంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం భార్య ప్రసవం కోసం తల్లిగారింటికి వెళ్లింది.
ఆంజనేయులు తన తొమ్మిదేళ్ల కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై భోజనం తీసుకుని ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన చెత్త లారీ బాలుడి పై నుంచి దూసుకెళ్లింది. దీంతో బాలుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. కళ్ళముందే కుమారుడు మృతి చెందడంతో ఆంజనేయులు శోకసంద్రంలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






