ఆస్తి కోసం తండ్రిపై కొడుకు దాడి

by Shyam |   (  Updated:2020-04-09 06:51:41  IST  )

<p>దిశ, మహబూబ్ నగర్: భూమిని తన పేరుపైన మార్చడానికి నిరాకరించాడని తండ్రిపై కన్న కొడుకు దాడి చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండలం గోపాలపురంలో వెంకట్‌రెడ్డి (75) పేరు మీద కొద్దిగా భూమి ఉంది. ఆయన కొడుకు గోవింద్ రెడ్డి ఆ భూమిని తన పేరు మీద పట్టా చేయించాలని కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నట్లు గ్రామస్తులు [&hellip;]</p>

ఆస్తి కోసం తండ్రిపై కొడుకు దాడి
X

దిశ, మహబూబ్ నగర్: భూమిని తన పేరుపైన మార్చడానికి నిరాకరించాడని తండ్రిపై కన్న కొడుకు దాడి చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండలం గోపాలపురంలో వెంకట్‌రెడ్డి (75) పేరు మీద కొద్దిగా భూమి ఉంది. ఆయన కొడుకు గోవింద్ రెడ్డి ఆ భూమిని తన పేరు మీద పట్టా చేయించాలని కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇందుకు తండ్రి నిరాకరించడంతో గోవింద్‌రెడ్డి కర్రలతో విచక్షణారహితంగా తండ్రిపై దాడి చేశాడని చెప్పారు.

Tags: Son attack, father, property, nagar kurnool

Next Story