పాత గుంటూరులో ఎస్ఐ పై దాడి

by  |
పాత గుంటూరులో ఎస్ఐ పై దాడి
X

దిశ, వెబ్ డెస్క్ :
శాంతిభద్రతలను కాపాడే వారికి సహకరించాల్సింది పోయి.. వారిపట్ల అగౌరవంగా ప్రవర్తించడంతో పాటు దాడులకు తెగబడుతున్నారు. నేరాలను అదుపు చేసే పోలీసులతో సైతం ఘర్షణలకు దిగుతున్నారు. తాజాగా పాత గుంటూరులో ఎస్సై పై స్థానికులు భౌతిక దాడికి దిగారు. వివరాల్లోకివెళితే..

పాత గుంటూరులోని పొన్నూరు రోడ్డులో మంగళవారం ఎస్ఐ అమీర్ తన సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టాడు. ఈ సమయంలో స్థానికులు ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. మాటా మాటా పెరిగి అది కాస్త వివాదంగా మారింది.దీంతో ఎస్ఐ అమీర్ పై స్థానికులు భౌతిక దాడికి పాల్పడ్డారు. వెంటనే సిబ్బంది ఆయన్ను జీజీహెచ్‌కు తరలించారు. డీఎస్పీ సీతారామయ్య ఘటనా స్థలికి చేరుకుని ఘర్షణకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

Next Story