- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుసగుస.. వాళ్లకు వజ్రాలు దొరికాయంట!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఓ విషయమై గుసగుసలు వినిపిస్తున్నాయి. అది ఆ నోట ఈ నోట పడి అందరూ ఇదే విషయమై జోరుగా చర్చించుకుంటున్నారు. అదేమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైతుకు వజ్రం దొరికిందంట. వివరాల్లోకి వెళితే.. కర్నూల్ జిల్లాకు చెందిన రైతుకు వజ్రం లభ్యమైందని, మద్దికెర మండలం పెరవలిలో గురువారం 2 క్యారెట్ల బరువు గల వజ్రం దొరికినట్లు చర్చించుకుంటున్నారు. ఈ వజ్రాన్ని గుత్తికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఓ విషయమై గుసగుసలు వినిపిస్తున్నాయి. అది ఆ నోట ఈ నోట పడి అందరూ ఇదే విషయమై జోరుగా చర్చించుకుంటున్నారు. అదేమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైతుకు వజ్రం దొరికిందంట. వివరాల్లోకి వెళితే.. కర్నూల్ జిల్లాకు చెందిన రైతుకు వజ్రం లభ్యమైందని, మద్దికెర మండలం పెరవలిలో గురువారం 2 క్యారెట్ల బరువు గల వజ్రం దొరికినట్లు చర్చించుకుంటున్నారు. ఈ వజ్రాన్ని గుత్తికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది. అదేవిధంగా ఇదే మండలంలోని మదనంతపురం గ్రామానికి చెందిన పలువురు కూలీలు తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామంలో వ్యవయసాయ పనుల నిమిత్తం వెళ్లారు. ఈ సమయంలో వారిలో ముగ్గురికి వజ్రాలు దొరికినట్లు సమాచారం.
Next Story






