అతి త్వరలో ‘సోలో బ్రతుకే సో బెటర్’

by  |
అతి త్వరలో ‘సోలో బ్రతుకే సో బెటర్’
X

దిశ, వెబ్‌డెస్క్ : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ‘అతి త్వరలో మీ ముందుకు’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసిన తేజ్.. గ్యాంగ్ లీడర్‌లో చిరంజీవిలా కనిపిస్తుండగా, బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్. సుబ్బు దర్శకత్వంలో వస్తున్న సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఈ సినిమాలో నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

https://twitter.com/IamSaiDharamTej/status/1318864344151552000?s=19

వరుస డిజాస్టర్‌ల తర్వాత ‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ చిత్రాల ద్వారా సక్సెస్ ట్రాక్‌లో ఎక్కిన తేజ్.. ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకుంటాననే ధీమాతో ఉన్నాడు.



Next Story