దారుణం.. రెండోభార్య కూతురిపై లైంగిక దాడి

by  |
దారుణం.. రెండోభార్య కూతురిపై లైంగిక దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: నాకు ఇదివరకే పెళ్లయింది. కానీ విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నా. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌ ఒత్తిడి మేరకు మళ్లీ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, ఇప్పటికే సంసారంలో దెబ్బతిని ఉన్న నేను.. నిన్ను ఆప్యాయంగా చూసుకుంటా, కంటికి రెప్పలా కాపాడుకుంటా. భవిష్యత్‌ గురించి అస్సలే బెంగ పెట్టుకోకు. మన ఇద్దరిదీ ఒకటి పరిస్థితి. కలిసి ఉంటే ఎలాంటి మానసిక క్షోభా లేకుండా కొత్త జీవితాన్ని.. సరికొత్తగా మలుచుకోవచ్చు. నాకు వచ్చే జీతంలో కొంత ఖర్చులకు పోయినా మిగతా డబ్బుతో ఆనందంగా ఉండొచ్చని.. నమ్మబలికి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్. అయితే అప్పటికే ఆ మహిళకు 17 ఏళ్ల కూతురు ఉంది. పెళ్లి సమయంలోనే తన కూతురును తమ బంధువుల వద్దనే ఉంచుతానని ఆ మహిళ చెప్పింది. మేడ్చల్ జిల్లా నేరెడ్‌మెట్‌లో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జయరాం.. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యతో విభేదాల వల్ల విడాకులు ఇచ్చి మరో మహిళను పెళ్లి చేసుకొని కాపురం పెట్టాడు. ఆ మహిళ(రెండోభార్య)కు 17 ఏళ్ల కుమార్తె ఉంది. ఏడాది పాటు భార్యతో సక్రమంగానే ఉన్న జయరాం.. ఆమె 17ఏళ్ల కూతురును కూడా తమతోనే ఉంచుకుందామని, సొంత కూతురిలా చూసుకుంటానని ఇబ్బంది పెట్టడంతో నమ్మిన ఆ మహిళ… బాలికను ఇంటికి తీసుకువచ్చింది. ఇదే క్రమంలో భార్య బయటకు వెళ్లిన సమయంలో బాలికను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం రెండో భార్యకు తెలియడంతో భర్తను నిలదీయలేక కూతురును బంధువుల ఇంటి వద్ద వదిలివచ్చింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న జయరాం మళ్లీ టార్చర్ మొదలు పెట్టాడు. బాలికను తీసుకురావాలని తీవ్రంగా వేధించాడు. భర్త చేష్టలను భరించలేక పోయిన ఆ మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story

Most Viewed